పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేనెప్పడెప్పడు ప్రభువు ముఖారవిందాన్ని
దర్శిస్తానా అని ఉవ్విళ్ళూరిపోతున్నాను" - 42,1-2.

"ప్రభో! వనాలు కురవనందున
ఎండి బీటలువారిన నేలలాగా

నా హృదయం నీ కొరక దప్పిక గొంటూంది
నిన్ను చూడాలని నేనెంతో వేగిరపడుతున్నాను" - 63,1.

"మోక్షంలో మాత్రం నీవు దప్ప ఇంకెవరున్నారు
ఈ లోకంలో నీవు దప్ప మరొకటి నాకు రుచించదు" - 73,25.

ఈ ప్రార్థనలు హృదయము నుండి వెలువడినవి, చిత్తశుద్ధి కలవి. సాధకులు ప్రారంభంలో ఈలాంటి భక్తిమంతమైన ప్రార్థనలను వాడుకొని ప్రభు దర్శనం కొరకు మనవి చేసికోవాలి. అటుపిమ్మట సొంత ప్రార్థనలతో ప్రభు సాక్షాత్కారం కొరకు మనవి చేసుకోవచ్చు.

4. హృదయంలో దైవప్రవేశం

ప్రభువు మొదట మనకు తమ విూద కోర్కెపట్టిస్తాడు. అటుపిమ్మట ఆ కోర్మెను తీర్చడానికి స్వయంగా మన హృదయాల్లోకి ప్రవేశిస్తాడు. ఈ సత్యాన్ని విశదం చేసే బైబులు సందర్భాలు కొన్ని వున్నాయి.

ప్రభువు ఈలా సెలవిచ్చాడు. "నేను ద్వారం దగ్గరికి వచ్చి తలుపు తడతాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోనికి వస్తాను. ఆ తెరచిన యతనితో భుజిస్తాను. అతడూ నాతో భుజిస్తాడు" - దర్శ 3,20, ప్రభువు మన హృదయ ద్వారం చెంతకు వచ్చి మొల్లగా తడతాడు. అనగా 'మనకు ప్రబోధం కలిగిస్తాడు. అతడు మన స్వాతంత్ర్యాన్ని మన్నించేవాడు. కనుక మనలను నిర్బంధపెట్టడు. మన అనుమతి లేందే, మనం బుద్ధిపూర్వకంగా ఆహ్వానించందే, మన హృదయంలోని ప్రవేశింపడు. ఆ ప్రభువు స్వరం విని అతన్నిలోనికి ఆహ్వానించేవాళ్ళ హృదయాల్లోకి అతడు అడుగిడతాడు. వాళ్ళతో తానూ, తనతో వాళూ భోజనం చేస్తారు. ఇక్కడ భోజనం చేయడమంటే యేమిటి? మిత్రులైన వాళ్ళ ఒకరి సరసన ఒకరు కూర్చుండి ఆప్యాయంగా కబుర్లు చెప్పకొంటూ భుజిస్తారు. శత్రువులైన వాళ్ళు అలా ఒకరి సరసన ఒకరు కూర్చోరు. కనుక ప్రభువు మనతో భోజనం చేస్తాడంటే అతడు మనకు మిత్రుడై యుంటాడని భావం. ఎవరు ఆ ప్రభువు ప్రబోధానికి లొంగి అతన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళకు అతడు