పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావం. ఈ విధంగా ప్రభువు మన హృదయాన్ని పవిత్రం చేయాలని మనం నిత్యమూ ప్రార్థించాలి. ఎందుకంటె మన హృదయం దానంతట అది కపటంతోను మోసంతోను కూడింది. కనుక అది ప్రభువు వలన శుద్ధిని పొంది నూత్న హృదయంగా మారిపోవాలి - యెహెజ్మేలు చెప్పినట్లుగా.

6. ప్రార్ధనా భావాలు

1. అబ్రాహాము తొంబదితొమ్మిది యేండ్లవాడై యుండగా ప్రభువు అతన్ని పిల్చాడు. నీవు నా సన్నిధిలో నడుస్తూ ఉత్తముడిగా మెలగాలి అని చెప్పాడు. ప్రభువు ఆజ్ఞ ప్రకారం అతడు జన్మదేశాన్ని బంధువులనూ విడనాడి కనాను మండలానికి వచ్చాడు. జీవితాంతమూ ప్రభువు సన్నిధిలోనే నడుస్తూ ఉత్తముడుగా మెలిగాడు - ఆది 17,1. తర్వాత ప్రభువు అబ్రాహాముని పరీక్షించడానికై అతని యేకైక కుమారుణ్ణి తనకు బలియిూయమని కోరాడు. ఆ ముసలిప్రాయంలో తాను ఆ బిడ్డణ్ణి కోల్పోతే మరో పత్రుడు కలగడని అబ్రాహాముకి బాగా తెలుసు. ఐనా అతడు ఈసాకుని బలి యూయడానికి సంసిద్దుడయ్యాడు - ఆది 22,10-12.ఈ యబ్రాహాము ఎంత చిత్తశుద్ధి గల భక్తుడో! మనకు కూడ అతని లాంటి హృదయం అబ్బితే యెంత బాగుంటుంది!

2. నవోమి అనే యూద గృహిణి కుటుంబ సమేతంగా మోవాబు మండలానికి వలసపోయింది. అక్కడ ఆమె భర్తా ఇద్దరు కొడుకులూ గతించారు. ఇరువురు కోడళ్లు మాత్రం మిగిలిపోయారు. నవోమి మళ్లా బేత్లేహేముకు తిరిగివస్తూ కోడళ్ళను మోవాబు మండలంలోని తమ పట్టినిండ్లకు వెళ్ళిపొమ్మంది. పెద్దకోడలు అలాగే వెళ్ళిపోయింది. కాని చిన్న కోడలు మాత్రం “నేను గూడ నీ వెంటనే వస్తాను. నీ బంధువులే నాకు బంధువులౌతారు. నీ దేవుడే నాకూ దేవుడౌతాడు. నీవు చనిపోయే కాడే నేనూ చనిపోతాను. నిన్ను పాతిపెట్టేకాడే నన్నూ పాతిపెడతారు. మరణం వరకూ మనమిద్దరమూ విడిపోగూడదు" అంది - రూతు 1,16–17. ఈ రూతు ఎంత చిత్తశుద్ధిగల ఆడపడుచు! మగడు గతించాక గూడ కన్నవారిని సయితము విడనాడి అత్త వెంటబడి వచ్చింది! ఆమె శీలంవంటి శీలం మనకు కూడ అలవడితే యెంతముచ్చటగా వుంటుంది!

3. ఓ మారు ప్రభువు యెరూషలేం దేవళంలో బోధిస్తున్నాడు. అప్పడు జనం కానుకల పెట్టెలో సొమ్మ వేస్తున్నారు. ఉన్నవాళ్ళ ఉన్నట్లుగా కానుకలు పడవేస్తున్నారు. ఆ సమయంలో ఓ పేదరాలు కూడ వచ్చి రెండు కాసులు మాత్రమే పెట్టెలో వేసింది. ఐనా ప్రభువు ఆమెను మెచ్చుకొన్నాడు. డబ్బు మస్తుగా వున్న ధనవంతులు పెద్ద మొత్తాలే వేసారు. కాని ఈవిడకున్నది రెండు పైసలే. ఐనా ఆ రెండు పైసలను గూడ ఆవిడ దానం