పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావం. ఇదే ప్రవక్త ప్రభువు తన ప్రజలకు ఏకైక దృష్టికల హృదయాన్ని అనుగ్రహిస్తాడనీ, దానితో వాళ్ళ ప్రభువుని శాశ్వతంగా పూజించి తామూ తమ తర్వాత వచ్చే భావితరాలవాళ్ళ కూడ బాగుపడిపోతారనీ నుడివాడు - 32,39. ఈలాంటి ఏకైక దృష్టికల హృదయంతో ప్రజలు ప్రభువుని అర్థం చేసికోగల్లుతారని గూడ చెప్పాడు – 24,7. ఇదే హృదయ జ్ఞానం.

క్రొత్త హృదయాన్ని గూర్చి ప్రవచించిన ప్రవక్తలందరిలోను బహుశః యెహెజేలు ముఖ్యడు. "ఇంతవరకు విూరు చేస్తున్న చెడ్డపనులను విరమించుకోండి. క్రొత్తమనసులనూ S's హృదయాలనూ పొందండి" అని ఈతడు ప్రజలను హెచ్చరించాడు - 18,31. కాని ప్రజలకు ఈ క్రొత్త హృదయాలు ఏలా సిద్ధిస్తాయి? ప్రభువే వాటిని దయచేయాలి. కనుక ప్రవక్త ప్రభువు పేరు మిూదిగా "నేను విూకు నూత్న హృదయాన్నీ నూత్నమనస్సునీ ప్రసాదిస్తాను. విూలోని రాతి గుండెను తొలగించి దాని స్థానే మాంసపు గుండెను నెలకొల్పుతాను. నా యాత్మను విూమిూద నిల్పి విూరు నా యాజ్ఞలను పాటించేలా చేస్తాను" అని పల్మాడు - 36,26-27. ఈ వాక్యాలు పూర్వవేదంలోని అనర్ఘరత్నాలకు చెందినవి. ఇక్కడ రాతిగుండ అంటే దేవుని విూద తిరుగుబాటు చేసి అతని ఆజ్ఞలను ధిక్కరించే గుండె. ఫరో ఈలాంటి గుండె కలవాడు. మాంసపు గుండె అంటే మెత్తని గుండె. విధేయతతో దేవుని ఆజ్ఞలకు కట్టపడి వుండే గుండె. అబ్రాహాము ఈలాంటి గుండె కలవాడు. ప్రభువు నరులను అవిధేయుల నుండి విధేయలనుగా మార్చి వాళ్ళు తన ఆజ్ఞలను పాటించేలా చేస్తాడని ఫలితార్థం. నూత్న హృదయమంటే ప్రధానంగా దేవుని ఆజ్ఞలకు కట్టుబడి వుండడమే.

5. హృదయాలను శుద్ధి చేసే ప్రభువు

యెహెజ్కేలు మొదలైన ప్రవక్తలు నూత్న హృదయాన్ని గూర్చి ప్రవచించారని చెప్పాం. ప్రభువు ప్రజలకు క్రొత్త హృదయాన్ని ప్రసాదిస్తాడని పాగ్దానం చేసాడని పల్కాం. ఈ వాగ్దానం క్రీస్తు రాకతో నెరవేరింది. మనందరి హృదయాలను మార్చేది ఆ ప్రభువే, అదేలాగో పరిశీలిద్దాం. మనం తరచుగా బాహ్యశుద్ధిని కోరతాం, కాని క్రీస్తు అంతశుద్ధిని కోరాడు. చెడ్డ అంతా మన హృదయంలోనే వుంది అని బోధించాడు. "హృదయంలో నుండి దురాలోచనలు పట్టుక వస్తాయి. వీటివలన నరహత్యలూ, వ్యభిచారాలూ, అశుద్ధకార్యాలూ, దొంగతనాలూ, కూటసాక్ష్యాలూ, దూషణలూ కలుగుతాయి. నరుని మాలిన్య పరచేది యివేకాని చేతులు కడుగుకోకుండా భుజించడం లాంటి బాహ్యశుద్ధి లేని క్రియలు కాదు" - మత్త 15,19. ఈ వాక్యాల ప్రకారం ప్రభువు హృదయ శుద్ధిని ఘనంగా ఎంచాడని అర్ధం జేసికోవాలి. 42