పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-

యోహా 14,9. ఈ సందర్భాన్ని బట్టిగూడ క్రీస్తు తండ్రి లాంటివాడనీ, తండ్రిపోలిక కలవాడనీ అర్థం జేసికోవాలి.

 పై రెండు యోహాను భావాలు. ఇక పౌలు భావాలు పరిశీలిద్దాం. మనలో తొలి ఆదాము పోలికా వుంది, మలి ఆదాము క్రీస్తు పోలికా వుంది. భువి నుండి పుట్టిన తొలి ఆదామును పోలిన మనం దివినుండి వచ్చిన రెండవ ఆదాము క్రీస్తును గూడ పోలివుండాలి - 1కొ 15,49. ఇక క్రీస్తు దేవునికి ప్రతిరూపం, అతనికి పోలికగా వుండేవాడు - 2కొ4,4.

 కాని ఈ క్రీస్తు దేవునికి ఏలా పోలికగా వుంటాడు? అతడు దేవుని కుమారుడు కనుక ఆ దేవునికి పోలికగా వుంటాడు. కుమారునిలో తండ్రిపోలిక వుంటుంది కదా! - రోమా 8,29. అతడు కరటికి కన్పించని దేవునికి పోలికగా వుండి ఆ దేవుణ్ణి మన కంటికీ కన్పించేలా చేస్తాడు - కోలో 1,15. ఫలితాంశమేమిటంటే క్రీస్తు తండ్రిపోలిక కలవాడు, ఆ తండ్రి లాంటివాడు, అతన్ని మనకు ప్రత్యక్షం చేసేవాడు.

3. క్రైస్తవుడు క్రీస్తు పోలికను పొందాలి


పూర్వం మోషే సీనాయి కొండ విూదికి వెళ్ళినపుడు ప్రభువు తేజస్సు సోకి అతని ముఖం ప్రకాశించింది - నిర్గ 34, 29-35. ఇక్కడ మోషే యావే తేజస్సును పొందాడు. కాని నూత్నవేదంలో మనం పొందేది యావే ప్రభువు తేజస్సు కాదు, ఉత్థాన క్రీస్తు తేజస్సు ఉత్తాన క్రీస్తుతాను ఆత్మను పొంది ఆయాత్మ తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. ఆ తేజస్సే మనవిూద కూడ సోకి మనం కూడ ఆ క్రీస్తుని పోలివుండేలా చేస్తుంది. అనగా క్రీస్తుని అంగీకరించి విశ్వసించేవాళ్లు అతనిలాంటివాళ్లు ఔతారని భావం. అతని భావాలనూ ప్రవర్తననూ అలవర్చుకొంటారని భావం - 2కొ 3,18. క్రీస్తు పోలిక మనకు ఉత్థానం తర్వాత గాని పూర్తిగా సిద్ధించదు. కాని ఈ జీవితంలోనే మనకు చేతనైనంతవరకు ఆ పోలికను సాధించడానికి కృషి చేయాలి. ఏలా? ఆ ప్రభువు ఆజ్ఞలను పాటిస్తూ అతని అడుగుజాడల్లో నడవడం ద్వారా, ఈ కృషి ఫలితంగా ఆ పోలికను ఇక్కడ పాక్షికంగాను, మరులోకంలో సంపూర్ణంగాను పొందుతాం.

4. ప్రార్థనా భావాలు


1. హీబ్రూ ప్రజలకు ఇరుగుపొరుగు జాతులైన కనానీయులు ఫిలిస్ట్రీయులు మొదలైనవాళ్ళంతా ప్రతిమలను పూజించారు. యిస్రాయేలీయులు కూడ చాలసార్లు విగ్రహాలను కొలిచారు. ఈ ప్రజల భావాల ప్రకారం విగ్రహం దేవుని శక్తితోను సామర్థ్యంతోను నిండివుంటుంది. ఇక బైబులు నరుడు దేవునికి పోలికగా వుంటాడు అని
37