పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/255

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13.ప్రభువు నా చెంతనే వుంటాడు
నరులు నాకేమి కీడు చేయగలరు
నరులమీద ఆధారపడ్డం కంటె
ప్రభువనే నమ్ముకోవడం మేలు
గొప్పవాళ్ళను ఆశ్రయించడం కంటె
ప్రభువు మీదనే భారం వేయడం మేలు - 118, 7-9
14.పాలుత్రాగి తల్లి రొమ్ము మీద ప్రశాంతంగా పండుకొన్న పసిబిడ్డలాగ
నా హృదయం నిమ్మళంగా వుంది
నా మనసు సంతుష్టి చెందుతూంది 131.2
15.నన్ను నేను నీ చేతుల్లోకి అర్పించుకొంటున్నాను - 31, 5
16.ప్రభువు తల్లి పక్షిలా నిన్ను తన రెక్కలతో కప్పతాడు
అతని రెక్కలక్రింద నీవు సురక్షితంగా వుండిపోతావు
అతడు నమ్మదగినవాడు
ఓ డాలులాగ నిన్ను కాపాడేవాడు - 91,4
17.ప్రభువు నిన్ను తన దూతల రక్షణంలో వంచుతాడు
నీ వెక్కడికి వెళ్ళినా వాళ్ళు నిన్ను కాపాడుతూంటారు
నీ కాలు రాతికి దగిలి నొవ్వకుండా వుండేలా
వాళ్ళు నిన్ను తమ చేతుల్లో మోసికొనిపోతూంటారు - 91, 11-12
18.మా పితరులుగూడ నిన్నే నమ్మకొన్నారు
నిన్ను నమ్ముకోగా, నీవు వాళ్ళను రక్షించావు - 22,4
19.ప్రభువు పేదలను దుమ్ములోనుండి పైకి లేపుతాడు
దీనులను దిబ్బల మీదినుండి లేవనెత్తుతాడు
రాజుల సరసన కూర్చుండబెడతాడు - 113, 7-8
20.ప్రభువే దేవుడని తెలిసికొనండి
అతడు మనలను కలిగించాడు
మనం అతని వాళ్ళం
ఆ ప్రభు ప్రజలం, అతడు మేపే మందలం - 100,3
21.పనివాళ్ళ పనికిరాదని నిరాకరించిన రాయే
చివరకు భవనానికి మూలరాయి అయింది – 118, 22
22.ప్రభువే మనకీ సుదినాన్నిచ్చాడు
కనుక సంతోషిద్దాం, ఉత్సవం జేసికొందాం - 118, 24