పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/250

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6.ప్రభో! నీవు దుష్కార్యాన్ని సహింపవు
పాపకార్యాన్ని నీ చెంతకు రానీయవు
నీవు గర్వాత్ములను చీదరించుకొంటావు
పాపకార్యానికి పూనుకొనేవాళ్ళంటే
నీకు పరమ అసహ్యం - కీర్త 5, 4-5
7.సకల జాతుల్లోను మీరే నా జనులు, నా సొంత ప్రజలు. మీరే నాకు యాజక
 రూపమైన రాజ్యం, మీరే నా పవిత్ర ప్రజ - నిర్గ 19, 5-6
8. అబ్రాహాము తొంబై తొమ్మిది యేండ్లవాడై యున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై "నేను సర్వశక్తిమంతుజ్జయిన దేవుణ్ణి.నీవు నా సన్నిధిలో మెలుగుతూ ఉత్తముడవుగా
 ఉండాలి” అని చెప్పాడు —అది 17,1
9. మోషె దేవుణ్ణి చూడ్డానికి భయపడి ముఖం కప్పకొన్నాడు - నిర్గ 3, 6
10. నీవు నా ముఖం చూడలేవు. ఏ నరుడు నన్ను జూచి బ్రతకజాలడు - నిర్గ 33, 20
11. అప్పడు నేను "హా! చెడితినిగదా! నా పెదవులనుండి వెలువడేవన్నీ పాపపు మాటలే.
 నాతో వసించే యీ ప్రజలు పలికేవిగూడ పాపపు మాటలే. ఐనా నా యూకండ్లతో
 సర్వశక్తిమంతుడైన మహాప్రభువుని దర్శించానుగదా!" అనుకొన్నాను -యేష 6,5
12. సైన్యాల కధిపతియైన ప్రభువు పరిశుదుడని గ్రహించండి. అతన్ని చూచి
 భయపడండి - యెష 8, 12
13. అటుపిమ్మట మెల్లని స్వరం విన్పించింది. ఆ స్వరాన్ని వినగానే యేలియా తన
 అంగీ చెంగుతో ముఖాన్ని కప్పకొన్నాడు - 1 రాజు 19, 12
14. అలా వలలో విస్తారంగా చేపలుపడ్డం చూచి సీమోనుపేత్రు యేసు పాదాలమీదపడి
 "ప్రభో! నేను పాపిని. నీవు నన్ను విడిచివెళ్ళిపో" అన్నాడు - లూకా 4,8
15. పవిత్రాత్మ నీమీదికి దిగివస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్మకొంటుంది.
 అందుచేత పట్టబోయే శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడు అనబడతాడు - లూకా 1, 35

14. ప్రభువు ప్రేమమయుడు


 భగవంతుడు ప్రేమమయుడు. కరుణానిధి. బైబులు ఆ ప్రభువుని తల్లితోను,
తండ్రితోను, భర్తతోను పోలుస్తుంది. ఆ దయామయుడు విధవలనూ అనాథబాలలనూ గూడ మరచిపోడు. పాపి అంటే ఆయనకు ఎంతో జాలి. భక్తుడు తన మననంద్వారా ప్రేమమూర్తియైన భగవంతుణ్ణి అనుభవానికి తెచ్చుకొంటూండాలి.
243