పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/246

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓయి! మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసియేయున్నాడు
 " నీవు న్యాయాన్ని పాటించు, ప్రేమతో మెలుగు,
 నీ దేవుని పట్ల వినయంతో ప్రవర్తించు
 ప్రభువు నీ నుండి కోరుకొనేది యిదే - మీకా 6, 6-8,

11. ప్రభువు సర్వజ్ఞడు

ప్రభువు కర్మసాక్షి ఆయనకు అన్నీతెలుసు. మనం చేసే పనులన్నీగమనిస్తూనే
వుంటాడు. ఆ ప్రభువు మన హృదయంలోని ఆలోచనలనూ కోర్కెలనూగూడ గుర్తుపట్టగలడు. మన భవిష్యత్తు ఎలా వుంటుందో మనకు తెలియదుగాని, ఆయనకు తెలుసు. అతనికి రహస్యాలంటూ లేవు, భక్తుడు ఈ సత్యాన్ని గుర్తించి పాపకార్యాలకు పూనుకోకుండా వుండాలి. మన పాపపుణ్యాలను గుర్తించి వాటికి సంభావనా దండనా విధించే నాథుడొకతున్నాడని అర్థం చేసికోవాలి.

3.ప్రభూ! నేను నీ కోసం ఎంతగా ఆశపెట్టుకొన్నానో
 ఎంతగా ఆపసోపాలు పడుతున్నానో నీకు తెలుసు - కీర్త 38,9
4. నీవు దూరంనుండే నా యూలోచనలను గుర్తుపడతావు- కీర్త 139,2
5. ప్రభో! నరుల హృదయాల్లోని ఆలోచనలు తెలిసినవాడివి నీ వొక్కడవే - 1 రాజు 8,39
6.నీవు మాతృగర్భంలో రూపొందకమునుపే
 నిన్ను గూర్చి నాకు తెలుసు
" నీవు జన్మింపమునుపే నిన్ను పవిత్రపరచి
జాతులకు ప్రవక్తగా నియమించాను -యిర్మీ, 1.4
7. ప్రభువు నన్ను చూడడు
 ఆకాశంలో వుండేవాడు నన్ను స్మరించుకొంటాడా?
 లోకంలో ఇంతమంది జనులుంటే దేవుడు నన్ను గుర్తుపడతాడా ?
 అనంతమైన యీ విశ్వంలో నేనేపాటివాడ్డి అనుకోబోకు - సీరా 16,17
8. నీవు చేసేపని నీకు సబబుగానే వుండవచ్చు. కాని నీ ఉద్దేశాలను పరిశీలించి
 చూచేవాడు ప్రభువు -సామె 16,2
9. నేను పట్టకమునుపే నన్ను గూర్చి నీకు తెలుసు
 నాకు నిర్ణయింపబడిన దినాలన్నీ
 నీ గ్రంథంలో లిఖింపబడి వున్నాయి.
 - అవి యింకా ప్రారంభం కాకమునుపే -కీర్త 139, 16
239