పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/245

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.

నే నిప్పుడు ఏండ్ల కడచిన ముదుసలిని
 ఐనా నీతిమంతుడైన నరుడ్డి ప్రభువు చేయి విడవడంగానీ,
 అతని కుమారులు బిచ్చమెత్తుకోవడంగానీ,
 నే నింతవరకు చూడలేదు - 37, 25
6.ప్రభూ! నా దోషాలను పరిశీలించబోకు
 నీ ముందట నిర్దోషియైనవా డొక్కడూ లేడు -143, 2
7.ఋజువర్తనులతో నీవూ ఋజువుగానే ప్రవర్తిస్తుంటావు,
కాని కపటవర్తనులతో నీవూ కపటంగానే మెలుగుతూంటావు - 18, 26
8. ప్రభువు నీతిమంతులకు సాయపడుతూంటాడు
 కాని దుర్మార్డులు సర్వనాశమైపోతారు - 1,6
9.నీతిమంతుడు చాలా బాధలకు గురౌతాడు,
 ఐనా వాటన్నిటినుండీ ప్రభువతన్ని రక్షిస్తాడు - 34, 19
10. నీతిమంతులూ దయాపరులూ ఐన సజ్జనులకు
 చీకటిలోగూడ వెలగు ప్రకాశిస్తుంది - 112,4
11. అబ్రాహాము తొంబై తొమ్మిది యేండ్ల యిూడువాడై యున్నపుడు దేవుడు ప్రత్యక్షమై
 "నేను సర్వశక్తిమంతుజ్జయిన దేవుడ్డి నీవు నా సన్నిధిలో నడుస్తూ ఉత్తముడివిగా
మెలగాలి" అని చెప్పాడు. - అది 17,1
12. ఈ ప్రజలలో సమరులనూ, దైవభీతికలవారినీ, లంచగొండులు కానివారినీ యేరి
 వీరికి నాయకులను చేయి - నిర్ధ 18,21
13.ఇకమీదట యావేకు భయపడి ఆ ప్రభువుని చిత్తశుద్ధితో పూజించండి - యోషు 23, 14
14.హిస్మియా గోడవైపు మొగం త్రిప్పి "ప్రభూ! నేను చిత్తశుద్ధితోను నమ్మదగిన
తనంతోను నిన్ను సేవించానని జ్ఞప్తికి తెచ్చుకో. నే నెల్లవేళలా నీ చిత్తాన్ని పాటించాను" అని ప్రార్థన చేస్తూ కన్నీళ్ళ కార్చాడు - 2 రాజు 20,3
15. స్వర్గంలోని దేవుణ్ణి పూజించడానికి వచ్చినపుడు
 నేనేమి తీసికొని రావాలి?
 ఏడాది దూడలను దహనబిలిగా కొనిరావాలా?
 వేలకొలది పోట్టేళ్ళనీ, పదివేల నదుల ఓలివర్రెలాన్నీ
 కొనివస్తే అతడు సంతుష్టి చెందుతాడా?
 నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా
 నా జ్యేష్ఠకుమారుని బలిగా అర్పించాలా?
238