పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/242

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. హృదయం

బైబుల్లో హృదయంటే నరుని వ్యక్తిత్వం. విశేషంగా నైతికమైన వ్యక్తిత్వం, హృదయంద్వారా నరుడు భగవంతునితో సంబంధం పెట్టుకొంటాడు. క్రీస్తు హృదయం మన హృదయంమీద సోకి దాన్ని పవిత్రం చేస్తుంది.

1.భూమిమీద మానవులు దుపులైపోయారు. వాళ్ళు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయాలనే కోరుకొనేవాళ్ళ - ఆది 6,5 2.యావనంనుండి కూడ నరుని ఆలోచనలు దుష్టంగానే వుంటాయి - ఆది 8,21 3.యిస్రాయేలీయులందరు సున్నతి సంస్కారంలేని హృదయం కలవాళ్ళ యిర్మీ 9, 26 4.దేవుడు నరుడు చూచే చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపాన్ని మాత్రమే చూస్తాడు. కాని దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు - 1సమూ 16,7

5.నరుని హృదయాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
హృదయానికున్నంత కపటం దేనికీ లేదు
అది ఫబోరవ్యాధితో కుమిలిపోతుంటుంది
దాని రోగాన్ని కుదర్చలేం
ఐనా ప్రభువునైన నేను నరుని మనస్సునీ
హృదయాన్నీ పరిశీలించి చూస్తూంటాను
ప్రతినరుద్ధి అతడు జీవించే తీరునుబట్టీ,
పనిచేసే రీతినిబట్టీ, సంభావిస్తుంటాను - యిర్మీ 17, 9-10

6.ఈ ప్రజలు నన్ను పెదవులతో గౌరవిస్తున్నారు. వీళ్ళ హృదయాలు నాకు దూరంగా వున్నాయి-యెష 29, 13 7.దేవుని వాక్కరెండంచుల కత్తిలా మన హృదయాన్ని నరుకుకొని లోపలికి పోతుంది. ఆ హృదయంలోని కోరికలనూ ఆలోచనలనూ పరిశీలించి చూస్తుంది - హెబ్రే 4, 12 8.పాతాళలోకం కూడ ప్రభువుకి తెలియందికాదు అంటే నరుని హృదయాలోచనలు అతనికి తెలియకుండా వుంటాయా? -సామె 15, 11 9.మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణశక్తితో ప్రేమించండి - ద్వితీ 6, 4-5 10.దేవా! నాతో నిర్మల హృదయాన్ని సృజించు నూతనమూ స్థిరమూ ఐన మనస్సును నాలో నెలకొల్పు నీ సన్నిధినుండి నన్ను గెంటివేయకు నీ పరిశుద్ధాత్మను నా యొద్దనుండి తీసివేయకు - కీర్త 51, 10-11