పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 B. ఏ వ్యక్తియైనా ధనికుడై వండికూడ అవసరంలో వున్న నరుణ్ణి జూచి హృదయ ద్వారాన్ని మూసివేసికొంటే, ఇక హృదయంలో దైవప్రేమ వుందని ఎట్లా చెప్పకోగలడు? బిడ్డలారా! మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కారాదు. అది చేతలతో నిరూపింపబడే యథార్థ ప్రేమ కావాలి - 1 యోహా 8, 17-18.

6.C. కూడు గుడ్డల కొరకు సహోదరుడైనను లేక సోదరియైనను అలమటించుచున్నచో, వారి జీవితావసరములు తీర్పక "దేవుడు మిమ్మ దీవించుగాక, చలికి కప్పకొనుడు. హాయిగా భుజింపడు" అని మీలో ఎవడైన పల్కిన యెడల ప్రయోజనమేమి? క్రియలులేని విశ్వాసము ఒంటిదై నిర్జీవమైపోతుంది. - యాకో 2, 17-18.

7భగవంతుడు ఈ భూమిని నరులందరి కోసమూ సృజించాడు. దాని ఫలితాన్ని కూడ అందరూ అనుభవించాలనే ఉద్దేశించాడు. కాని అత్యాశవల్ల కొందరు మాత్రమే దాన్ని దక్కించుకొంటున్నారు. - భక్తుడు ఆంబ్రోసు

8.ఆకలితో చచ్చేవాడికి అన్నం పెట్టండి. లేకపోతే మీరే వాణ్ణి చంపినట్లు - ఆంబ్రోసు

9.ఇతరుల వస్తువులను దొంగిలించినవాడిని "దొంగ" అంటాం. బట్టలు లేనివాడికి బట్టలు ఈయగలిగికూడ ఈయనివానిని అదే పేరుతో పిలవవద్దా? నీ యింటిలో సమృద్ధిగా వున్న భోజనం పేదవాడికి చెందుతుంది. అవసరం లేకున్నానీ యింటిలో భద్రంగా దాచివుంచిన దుస్తులు గుడ్డలులేనివానికి చెందుతాయి. నీ యింటిలో నీవు వాడకుండా అట్టిపెట్టుకున్న ముచ్చలు చెప్పలు లేనివాడికి చెందుతాయి. అలాగే నీవు కూడబెట్టిన డబ్బు కూడ పేదవాడికి చెందుతుంది. - భక్తుడు బాసిల్

10.నీవు కూడబెట్టిన ధనాన్ని ఎలా సంపాదించావు? నరుడు నాటకాన్ని చూడ్డానికి ఓ ఆసనం కొంటాడు. ఇక ఆ యాసనంమీద ఎవరినీ కూర్చోనీయడు. అది అందరికొరకూ ఉద్దేశింపబడినదే ఐనా, ఒక్కడు దాన్ని దక్కించుకొంటాడు. ధనవంతులుకూడా ఈలాగే చేస్తారు. వాళ్ళ ఇతరులకంటె ముందుగా పదిమందికీ చెందిన ఆస్తిని దేన్నో అనుభవిస్తున్నారు. కనుక దాన్ని శాశ్వతంగా తామే దక్కించుకోవాలని కోరుకొంటారు. ప్రతివాడు తనకు అవసరమైనది మాత్రమే వుంచుకొని మిగిలిన దానిని అక్కరలో వున్నవాళ్ళకు ఇచ్చివేస్తే ప్రపంచంలో ధనికులు దరిద్రులు అనే వ్యత్యాసం వుండదుకదా! నరుడు తల్లికడుపునుండి వట్టి చేతులతో వచ్చాడు. వట్టి చేతులతోనే మళ్ళీ భూమాత గర్భం చేరతాడు. మరి ఈ మధ్యలో అతడు కూడబెట్టిన సిరిసంపదలు ఎక్కడనుండి వచ్చినట్లు? -భక్తుడు బాసిల్