పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/236

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
                 

7. సాంఘిక న్యాయం


         దుష్టులు పరపీడనం, హత్య లంచాలు మొదలైన నేరాలకు పాల్పడతారు.
 దుర్మార్గుల కానుకలూ బలులూ దేవుడు అంగీకరించడు. సాంఘిక న్యాయాన్నిపాటించడం
 ఉత్తమారాధన మౌతుంది. అత్యాశవల్ల ఇతరులకు ముట్టవలసినదాన్ని మనం దక్కించుకొని
 మనసాంతం చేసికొంటాం. నరజాతి చరిత్ర అంతా పరపీడనంతో నిండివుంది.

<poem>1. భక్తిమంతులు భూమిమీద కరవైపోయారు
  సత్యవంతులు కలికానికైనా లేరు
  ప్రతివాడూ హత్యకు పాట్పడేవాడే
  ప్రతివాడూ పొరుగువాణ్ణి వేటాడేవాడే
  ప్రజలు దుర్మార్గాల్లో ఆరితేరిపోయారు
  అధికారులూ న్యాయమూర్తులూ లంచాలు కోరుతున్నారు
  పలుకుబడి కలవాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి -మీకా 7, 2-3

2. నిరంతరం మీరర్పించే యూ బలులు నా కెందుకు?
  మీరు దహనబలిగా అర్పించే పొట్టేళ్ళూ
  కోడెదూడల క్రొవ్వూ నాకు విసుగు పట్టిస్తున్నాయి
  ఎడ్ల నెత్తురూ మేకల నెత్తురూ నాకు గిట్టవు
  నా దేవళంలో ఆరాధించడానికి వచ్చేపుడు
 మిమ్ము వీటినన్నిటిని తీసికొని రమ్మ న్నదెవరు?
 మీ కొరగాని బలులు నాకిక వద్దు
 వాటి పొగను నేను చీదరించుకొంటున్నాను
 మీ అమావాస్య పండుగలు విశ్రాంతిదిన పండుగలు
 మీ జాతరలు నాకు అసహ్యంగా వున్నాయి
 వాటిని నేనిక భరించలేను, సహించలేను
 మీరు ప్రార్ధనకై చేతులెత్తినపుడు
 నేను మీ మొగంగూడ చూడను
మీరు ఎన్ని జపాలు చేసినా నేను విననే వినను
 మీరు వట్టి నరహంతలు = యెషయా 1, 11-15

3. అన్యాయార్జితమైన పశువుని బలిగా అర్పిస్తే
 ఆ బలి దోషపూరితమైన దౌతుంది
 దుష్టుల బలిని దేవుడు అంగీకరించడు

</poem>