జేసింది, అతని యింటికి సర్వాధికారినిగా నియమించిందీ, ఐగుప్త దేశానికి పాలకుడ్డిగా చేసిందీ ఆ ప్రభువే"- అది 45,7-8
3.యోసేపు సోదరులతో యింకా యిలా అన్నాడు. "మీరైతే నాకు కీడు తలపెట్టారు. కాని దేవుడు ఆ కీడుని మేలుగా మార్చాడు. మిమ్మందరినీ ప్రాణాలతో కాపాడ్డానికే దేవుడు అలా చేసాడు. - ఆది 50,20
<poem>4.నరుడు లాభకాంక్షతో ఓడ కడతాడు
తెలివితేటలతో నావను నిర్మిస్తాడు
కాని దాన్ని నీటిమీద నడిపించేది నీవే
సముద్రంలో ఓ మార్గం కల్పించి
అలలగుండా దాన్ని సురక్షితంగా నడిపించేది నీవే - జ్ఞాన 143
5.మంచీ చెడ్డా, మరణమూ జీవమూ
కలిమీ లేమీ, అన్నీ ప్రభువు నుండే వస్తాయి - సీరా 11,14
6.నరులు ఆలోచించి ప్రణాళికలు వేయవచ్చుగాక
వాళ్ళ పనులను నడిపించేదేమో దేవుడే - సామె 16,9
7.ప్రభువు తల్లి పక్షిలా నిన్ను తన రెక్కలతో కప్పతాడు
ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా వుండిపోతావు - కీర్త 91,4
8.ప్రభూ! మా పనులన్నీ నీవే చేసి పెడుతుంటావు
నీ వల్లనే మాకు విజయసిద్ధి కలుగుతుంది - యెష26,12
9.కుండ కుమ్మరితో వివాదానికి దిగుతుందా?
నీవేమి చేయబోతున్నానని మట్టి కుమ్మరిని అడుగుతుందా?
కుండ కుమ్మరికి నేర్పు చాలలేదని గొణుగుతుందా?
బిడ్డడు తల్లిదండ్రులతో మీరు నన్నెందుకు ఈలా పట్టించారని వివాదమాడతాడా?
ప్రభువు పనులకు మనం వంకలు బెట్టగూడదు
అతడేమి చేయాలో మనం చెప్పనక్కరలేదు - యెష45,9
10.ప్రభువే నాకు కాపరి, ఇక యేకొదవా లేదు - కీర్త 23,1
11.అతడు మీ తల వెండ్రుకలను గూడ లెక్కిస్తాడు - మత్త 10,30
12.నేను విత్తనం వేసాను. అపాల్లో నీళ్ళపోసాడు. కాని దానికి పెరుగుదలను ఇచ్చింది దేవుడే - 1 కొరింతి 3,6
13.దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకి అన్నీ అనుకూలంగానే జరుగుతాయి - రోమా 8,28
14.అతడు దుర్జనులకూ సజ్జనులకూ గూడ ఒకే విధంగా సూర్యప్రకాశాన్ని దయచేస్తాడు. సన్మార్గులకూ దుర్మార్గులకూ గూడ ఒకే రీతిగా వరాన్ని ప్రసాదిస్తాడు - మత్త 5,45. </poem>