పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/231

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.ఆకాశం ప్రభువుది
 భూమిని మాత్రం ఆయన నరుల కిచ్చివేసాడు - కీర్త 115,16

10.పురాతన కాలంలోనే నీవు భూమిని సృజించావు
 నీ చేతులతోనే ఆకాశాన్ని చేసావు
భూమ్యాకాశాలూ గతిస్తాయని నీవు గతించవు
 అవి చినిగిపోయిన బట్టల్లాగ శిథిలమైపోతాయి
నీవు వాటిని బట్టల్లాగ విప్పివేయగా
 అవి కంటికి కన్పించకుండా పోతాయి
 ఐనా నీవు మాత్రం ఎప్పడూ ఒకేరీతిగా వుంటావు
నీ ప్రాణానికి అంతమంటూ లేదు - కీర్త 102, 25-27

11.నీ కిష్టమైతే దేవుని ఆజ్ఞలు అనుసరించగలవు
 నీవు కోరుకొంటే దేవుని మాట పాటించగలవు
అతడు నీ ముందట నిప్పూ నీళ్ళూ రెండూ పెట్టాడు
 ఆ రెంటిలో నీ కిష్టమైనదాన్ని ఎన్నుకో
 నీ యెదుటనే జీవమూ మరణమూ రెండూ వున్నాయి
 ఆ రెంటిలో నీ కిష్టమైనదాన్ని తీసికో - సీరా 15, 15-17.

2) ప్రాణి సంరక్షణం

ప్రభువు ప్రాణికోటిని సృజించడమే ఓ వింత. కాని అంతకంటె పెద్దవింత, ఆయన తాను సృజించిన ప్రాణులను నిరంతమూ సంరక్షిస్తూండడం, ఔనుమరి, నారుపోసిన దేవుడు నీరుపోయకుండా వుంటాడా? ప్రభువు ప్రతినరుణ్ణి అతనికి మేలైన మార్గంలో నడిపిస్తూంటాడు. అలా నడిపించడం గూడ నిర్బంధపెట్టిగాదు, నరని స్వాతంత్ర్యాన్ని మన్నిస్తూనే. ఈ సత్యాన్ని గ్రహించినపుడు మనకు ఆ ప్రభువుపట్ల నమ్మికా భక్తిభావమూ కలుగుతాయి.

1.ప్రభువు తాను పోసిన ఊపిరి తీసివేస్తే
 ప్రాణికోటి అంతా నశిస్తుంది
 నరులంతా మంటగలసిపోతారు - యోబు - 9,14-15

2.యోసేపు సోదరులతో ఈలా అన్నాడు. "మిమ్మందరినీ ప్రాణాలతో కాపాడ్డానికీ, మీ బిడ్డలను భూమిమీద నిల్పడానికీ, మీకు ముందుగా దేవుడేనన్నిక్కడికి పంపాడు. నన్నిక్కడికి పంపింది దేవుడేకాని మీరుగాదు. నన్ను ఫరోరాజునకు మంత్రిగా