పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/225

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19 నా వాక్కనిప్పలాగ దహించదా? సుతైలాగ రాతిని ముక్కలు చేయదా? యిర్మీయా 23,29.
20 దేవుడు నరులవలె అసత్యమాడడు. మనుషులవలె ఆడితప్పడు. అతడు మాటయిచ్చి పనిచేయకుండునా? చేసిన ప్రమాణము నిలబెట్టుకొనకుండునా? - సంఖ్యా 23, 19.
21 ప్రభువు "మనుష్య కుమారుడా? నేను నికిచ్చినదానిని ఆరగించు. ఈ లిఖిత ప్రతిని భక్షించి వెళ్ళి యిప్రాయేలీయులతో మాటడులాడు" అని చెప్పాడు. నేను నోరు తెరవగా అతడు లిఖిత ప్రతిని ఇచ్చి "మనుష్య కుమారుడా! నీవు ఈ పుస్తకాన్నిభుజించి దీనితోనీ కడుప నింపుకో" అన్నాడు. నేను దానిని భుజింపగా అది తేనెలా తీయగా పంది - యెహి 3, 1-3,
22 ప్రభో! నీ దాసుడు ఆలించడానికి సిద్ధంగానే వున్నాడు, సెలవీయి - 1సమూ 3,10.
23 అతడు మార్గంలో మనతో మాట్లాడుతూ లేఖనాలను వివరిస్తుంటే మన హృదయం ప్రజ్వరిల్లలేదా! - లూకా 24,32.

24 మరియు ప్రభువు పాదాలచెంత కూర్చుండి అతని బోధలు ఆలిస్తూంది — లూకా 10;39.
25 ఇద్దరు ముగ్గురు నా పేరు మీదిగా సమావేశమైనకాడ నేను నెలకొని వుంటాను - మత్త 18,20.
26 మరియు ఆసంగతులన్నీ వృదయంలో పదిలపరచుకొని మననం చేసుకుంటూండేది = లూకా 2,19,
27 యేసు తల్లీ సోదరులూ అతని వద్దకు వచ్చారు. జనం క్రిక్కిరిసి వుండడం వల్ల వాళ్ళ అతన్నికలుసుకోలేకపోయారు. మీ యమ్మా సోదరులూ నీతో మాట్లాడడానికి వెలుపల వేచివున్నారు అని యెవరో అతనితో చెప్పారు. అందుకు యేసు దేవుని వాక్కుని ఆలించి పాటించేవాళ్ళే నాకు తల్లీ సోదరులూ ఔతారని చెప్పాడు - లూకా 8,19-21.
28 పరిశుద్ధ గ్రంథం దైవ ప్రేరణం వల్ల పట్టింది. అది సత్యాన్ని బోధిస్తుంది. దోషాన్ని ఖండిస్తుంది. తప్పలను చక్కదిద్దుతుంది. సత్ర్పవర్తన నేర్పుతుంది. దైవప్రజలచే సత్కార్యాలు చేయిస్తుంది - 2తిమో 3,16–17.
29 ప్రభువు వాక్కు సజీవమైంది. క్రియాత్మకమైంది. రెండంచుల కత్తి కంటె పదునైంది, అంతరంగందాకా కోసికొని పోతుంది. అది నరుల హృదయాల్లోని కోర్కెలనూఆలోచనలనూ పరిశీలించి చూస్తుంది - హెబ్రే 4, 12.