పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 నల్లజాతివాడు తన చర్మాన్ని మార్చుకోగలడా?
చిరుతపులి తన పొడలను మార్చుకోగలదా?
మార్చుకోగలిగితే, దుష్టకార్యాలకు అలవాటుపడిన
మీరుకూడ మంచిని చేయగల్లుతారు - యిర్మీ 18,23.
29 నేను మీమీద నిర్మలజలాన్ని చిలకరించి మీరు శుద్ధిని పొందేలా చేస్తాను. మీ విగ్రహాలనుండీ, మిమ్మమైలపరచే సమస్త వస్తువుల నుండీ, మీకు శుద్ధి చేస్తాను. నేను మీకు నూత్న హృదయాన్నీ నూత్న మనస్సునీ దయచేస్తాను. మీలోని రాతిగుండెను తీసివేసి దానిస్ధానే మాంసపు గుండెను నెలకొల్పుతాను. నా యాత్మను మీ మీదికి పంపుతాను. మీరు నా యాజ్ఞలను పాటించేలా, నా శాసనాల ప్రకారం జీవించేలా చేస్తాను. - యెహె 36, 25-27
30 ప్రభువు సెలవిచ్చేదేమనగా
"ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు
ఉపవాసంతో, దుఃఖంతో, ఏడ్పులతో
హృదయపూర్వక పశ్చాత్తాపంతో నా చెంతకు తిరిగిరండి
మీ బట్టలను చించుకొంటే చాలదు
మీ గుండెలను బ్రద్ధలు చేసికొనండి"
కనుక మీరు ప్రభువైన దేవునిచెంతకు తిరిగిరండి
అతడు దయాపరుడు కరుణానిధి
దీర్ఘ శాంతుడు, మాట నిలబెట్టుకొనేవాడు
మిమ్మ క్షమించి వదలివేస్తాడు - యోవేలు 2, 12-13
31 కాలం సంపూర్ణమైంది. దేవుని రాజ్యం సమీపించింది. హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించండి - మార్కు 1, 15
32 సుంకరి దూరంగా నిలబడి, కన్నులు పైకెత్తటానికైన సాహసించక, రొమ్ము బాదుకొని, దేవా! ఈ పాపిని కనికరించు అని ప్రార్థించాడు - లూకా 18,13
33 ఆ కుమారుడు తండ్రీ! నేను దేవునికీ, నీకు ద్రోహం చేసాను. ఇక నీ కుమారుడ్డి అనిపించుకోవడానికి తగను అని పల్మాడు - లూకా 15,21,
34 పేత్రు ప్రభువు చెప్పినమాట జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కివెక్కియేడ్చాడు - లూకా 22,62
35 నేను చేయగోరిన పనిని చేయక, నా కిష్టంలేని పనిని చేస్తున్నాను. మంచిని చేయాలనేకోరిక నాలోవున్నాదాన్ని చేసేశక్తి మాత్రం నాకు లేదు. నేను చేయగోరిన మంచిని చేయక, చేయవద్దనుకొన్న చెడ్డను చేస్తున్నాను - రోమా 7, 15-19