పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/220

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా పుణ్యక్రియలు మలిన వస్త్రంలాంటి వయ్యాయి
మేము అకుల్లాగ ఎండిపోయాం
మా పాపాలు మమ్మ గాలిలాగ ఎగరగొట్టాయి
నీకు ప్రార్థన చేసేవాడెవడూ లేడు
నిన్నాశ్రయించేవాడు ఎవడూ కన్పింపడు
నీవు నీ దివ్యముఖాన్ని మానుండి మరుగుజేసికొన్నావు
మా యపరాధాలను జూచి మమ్మ చేయి విడచావు
ఐనా ప్రభూ! నీవు మాకు తండ్రివి
మేము మట్టిమి, నీవు కుమ్మరివి
నీవే మమ్మందరినీ సృజించావు
ప్రభూ! మామీద మిక్కుటంగా కోపింపకు
మా పాపాలను సదా జ్ఞప్తియందుంచుకోకు
మమ్మ కరుణతో వీక్షించు
మేమందరం నీ ప్రజలం - యెష 64, 5-9
25 ప్రభువు మిమ్మ రక్షించలేని దుర్భలుడూ కాదు
మీ మనవిని ఆలింపలేని చెవిటివాడూ కాదు
కాని మీ పాపాలు మీకూ మీ దేవునికీ మధ్య
ఓ అగాధాన్ని సృజించాయి
మీ పాపాలవలన అతడు ముఖం మరుగుజేసికొని
మీ వేడికోలును ఆలించడంలేదు
మీరు హత్య దౌర్జన్యం, అనృతం
అనే పాపాలకు పాల్పడ్డారు - యెష59, 1–4
26 నా ప్రజలు రెండు నేరాలు చేసారు
జీవజలాల బుగ్గనైన నన్ను పరిత్యజించారు,
నెర్రెలు విచ్చుటచే నీళ్ళ నిలువని
రాతితొట్లను తొలిపించుకొన్నారు - యిర్మీ2:13
27 యువతి తన ఆభరణాలను మరచిపోతుందా?
వధువు తన వివాహవస్తాన్ని విస్మరిస్తుందా?
కాని నా ప్రజల్లు మాత్రం
లెక్కబెట్టాడానికి వీలులేనన్ని నాళ్ళు నన్ను విస్మరించారు - యిర్మీ 2, 32 213