పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17 నీ తమ్ముడెక్కడ అని దేవుడు కయీనుని అడిగాడు. అతడు నాకు తెలియదు. నేను వాడికేమైనా కావలి వున్నానా? అని బదులు పల్మాడు - ఆది 4,9
18 దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహంగా పాపం చేసాను అన్నాడు. నాతాను ప్రభువు నీ పాపాన్ని క్షమించాడు. నీవు చావుకి తప్పి బ్రతుకుతావు అన్నాడు - 2 సమూ 12, 13
19 నీనివే ప్రజ ప్రభువు సందేశం నమ్మారు. వాళ్ళ జనులందరూ ఉపవాసం చేయాలని ప్రకటిచారు, అధికులనుండి అల్పులవరకు అందరూ గోనె తాల్చారు. ఆ సంగతి విని నీనివే రాజకూడసింహాసనం మీదినుండి క్రిందికి దిగాడు. తన రాజవస్తాలను తొలిగించి, గోనె తాల్చి బూడిదమీద కూర్చున్నాడు - యోనా 3, 5-6.
20 మీ పాపాలవల్ల మీకు ఎర్రని మచ్చలు పట్టాయి
కాని నేను మిమ్మ కడిగి మంచువలె శుభ్రం చేస్తాను
21 మీ పాపాలు ఎర్రగా వున్నా
మీరు ఉన్నివలె తెల్ల నౌతారు — యొష 1, 18
22 భూమ్యాకాశములారా వినండి!
ప్రభువు మాటలాడుతున్నాడు
నేను పెంచిన బిడ్డలే నామీద తిరగబడ్డారు
ఎద్దుకి తన యజమానుడు తనకెక్కడ మేత వేస్తాడో తెలుసు
గాడిదకు యజమానుడు తనకెక్కడ మేత వేస్తాడో తెలుసు
కాని యిప్రాయేలీయుల కేమీ తెలియదు
వాళ్ళ ఏమీ అర్థం చేసికోరు - యెష 1, 2-4
23 ఆకాశాన ఎగిరే బెగ్గురు పక్షులకు
తాము తిరిగిరావలసిన కాలం తెలుసు
గువ్వలకు వానకోవిలలకు కొంగలకు
తాము వలసపోవలసిన సమయం తెలుసు
కాని నా ప్రజలైన మీకు
ప్రభువునైన నాయాజ్ఞ లేమాత్రం తెలియవు - యిర్మీ 8,7
24 నీవు కోపించినా లెక్కచేయక మేము పాపం కట్టుకొన్నాం
నీ యాగ్రహాన్ని సరకుచేయక
పూర్వంనుండి మేము పాపం చేస్తూనే వున్నాం
మేమందరమూ అశుద్దులమయ్యాం