పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11.నేను దేవుని సన్నిధిలో నడుస్తూంటాను
జీవవంతుల లోకంలో తిరుగాడుతూంటాను - 116,8

12.నేను నిత్యం ప్రభుసాన్నిధ్యం కలిగించుకొంటూంటాను
అతడు నా చెంతనే వుంటాడు గనుక నా కేభయమూ లేదు - 16,8

13.నీవు జీవపు చెలమవు
నీ వెలుగులవలననే మేమూ వెలుగు చూస్తాం - 36,9

14.మోక్షంలో మాత్రం నీవుదప్ప ఇంకెవరున్నారు?
ఈ లోకంలో నీవుదప్ప మరొకటి నాకు రుచించదు - 73,25

15.నన్ను నీ సన్నిధికి రమ్మని పిల్చావు
ఇదిగో నేను నీ యెదుటికి వచ్చాను
నీ దివ్యముఖాన్ని నాకు మరుగుజేయకు - 27,8

16.ప్రభు వెవరికి దేవుడో ఆ ప్రజలు ధన్యులు కదా ! 144, 15

17.ప్రభువే నాకు వారసభూమి, నాకు పానపాత్రం
నా ప్రాణం అతని యధీనంలో వుంది - 16,5

18.దప్పిక గొనినవాళ్ళకు స్వచ్ఛమైన నీళ్ళు ఆనందాన్నిస్తాయి.
అలాగే ప్రభువు రక్షణాన్ని పొందినవాళ్ళకు ప్రమోదం కలుగుతుంది - యెష 12,8

19.రానున్న దినాల్లో ప్రభువు మందిరమున్న పర్వతం
శైలాలన్నిటిలోను ఉన్నతమైన దౌతుంది
కొండలన్నిటిలోను ఎత్తయిన దౌతుంది
సకలజాతి జనులు దాని చెంతకు వస్తారు
ఆ ప్రజలు ఈలా పలుకుతారు
మనం ప్రభువు పర్వతానికి వెళ్లాం
యాకోబు దేవుని దేవళానికి పోదాం
అతడు తన మార్గాలను మనకు బోధిస్తాడు
మన మతని త్రోవల్లో నడుద్దాం
ధర్మశాస్త్రం సియోనునుండి వస్తుంది
ప్రభువువాక్కు యెరూషలేంనుండి బయలుదేరుతుంది - యొష 2, 2-4

20.నీనుండి దూరంగా వై దొలగేవాళ్ళ చస్తారు
నిన్ను త్యజించేవాళ్ళను నీవు నాశం చేస్తావు
దేవుని చెంత నుండడమే నాకు క్షేమకరం
నేను ప్రభువైన దేవుని ఆశ్రయించాను - కీర్త 78, 27-28