పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/207

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవ శతాబ్దంలో స్యూడో డయనీష్యస్ అనే రచయిత దూతలను 9 గణాలుగా విభజించాడు. ఆ గణాలను మళ్ళీ మూడేసి బృందాలతో గూడిన మూడు వర్గాలుగా విభజించాడు. ఆ వైనం ఇది:

1. సెరాఫులు - కెరూబులు – సింహాసనాలు

2. అధికారులు - నాథులు - శక్తులు

3. పరిపాలకులు - అతిదూతలు - దూతలు

ఈ గణ విభజనం ప్రాచీన క్రైస్తవ లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. కాని దీనికి బైబుల్లో ఆధారంలేదు. కనుక ఆధునికులు ఈ విభజనను పట్టించుకోరు.

సెరాఫులు యెషయా దర్శనంలో చూచిన దేవదూతలు - యెష 6,2. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు. వీళ్ళ దైవ ప్రేమతో మండిపోతుంటారు కనుక భక్తి జ్వాలకులు. కెరూబులు ఏదెనులోని జీవ వృక్షాన్ని కాపాడేవాళ్ళ - అది 3, 24 దేవుని సింహాసనాన్ని మోసేదికూడ వీళ్లే - కీర్త80, 2.

4. కావలి సన్మస్కులు

యాకోబు యోసేపు కుమారుల తలమీద చేతులు పెట్టి "ఎల్ల కీడుల నుండి నన్ను తప్పించిన దేవదూత ఈ బాలురను ఆశీర్వదించును గాక" అంటాడు - ఆది 48, 16. దీన్నిబట్టి యాకోబుని ఒక ప్రత్యేక దేవదూత కాపాడినట్లుగా అర్థం జేసికోవాలి. క్రీస్తు"ఈ చిన్నవారి దూతలు పరలోకంలో నా తండ్రి ముఖాన్ని దర్శిస్తుంటారు" అన్నాడు - మత్త 18,10. దీన్నిబట్టి చిన్నవారికి ప్రత్యేక దూతలు ఉన్నారనుకోవాలి. చెరనుండి బయటికి వచ్చిన పేత్రుని చూచి ప్రజలు ఇతడు పేత్రు దూత అనుకొన్నారు - అ, చ. 12,15. అనగా పేత్రుకి ఒక ప్రత్యేక దూత ఉన్నాడని భావం. ఈ ప్రత్యేక దూతలే కావలి సన్మనస్కులు.ప్రాచీన క్రైస్తవులు ఈ సన్మనస్కులను ఎక్కువగా నమ్మివారి పట్ల భక్తివిశ్వాసాలు చూపారు. వారికి కాపలా కాసేవాళ్ళ మార్గదర్శకులు, సంరక్షకులు, సహాయకులు, కాపరులు, నావికులు, సేనాపతులు అని పెక్కుపేర్లు పెట్టారు. ఈ పేర్లను బట్టే కావలి సన్మనస్కులు మనకు చేసే సహాయమేమిటో అర్ధం జేసికోవచ్చు. వాళ్ళ సేవలు మూడు రకాలుగా ఉంటాయి.

1. దూతలు మనలను అపాయాల నుండి కాపాడుతుంటారు. వీళ్ళ మన ప్రయాణాల్లో మనలను కాపాడుతారు. రఫాయేలు తోబీయాను ఈలా కాపాడాడు. కీర్తన 91, 11-12