పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/204

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరాధించమన్నాడు. కొందరు దేవదూతలు తమకంటె తక్కువ స్థాయికి చెందిన నరుణ్ణి ఆరాధించడానికి నిరాకరించారు. దేవుడు వారిని శపించి నరకానికి నెట్టివేసాడు. వాళ్ళే పిశాచాలు. వారి నాయకుడు సైతాను. దేవుని ఆజ్ఞకు విధేయులైనవాళ్ళ స్వర్గంలోనే వుండిపోయారు. వాళ్ళే సన్మనస్కులు. ఇప్పడు పిశాచాలు నిరంతరం దేవునికి వ్యతిరేకంగా పని చేస్తాయి. తమ స్థానాన్ని పొందే నరుల పట్ల ద్వేషం పెంచుకొని వారిని కూలద్రోయ జూస్తాయి. సన్మనస్కులు నరులకు సహాయం చేస్తుంటారు. కనుక వారికి దేవదూతలకూ నిరంతర వైరం వుంటుంది.

2. సన్మనస్కుల సేవలు

సన్మనస్కులు సృష్టిలోని భౌతిక పదార్థాలైన నేల, నిప్ప, వాయువు, జలం మొదలైన వాటిని కూడ కాపాడుతుంటారని కొందరు వేదశాస్త్రులు చెప్పారు. కాని వాళ్ళు ప్రధానంగా సంరక్షించేది నరుల్ని నరులకు వాళ్ళ చేసే సేవలను వేదశాస్త్రులు పలు రకాలుగా పేర్కొన్నారు. ఈ క్రింద కొన్నిటిని ఉదాహరిస్తున్నాం.

1. యిస్రాయేలు సంరక్షకులు, దేవదూతల యిస్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా కాపాడారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎన్నుకొన్న ప్రజలు కనుక, వారి దేవాలయాన్నీ నిబంధననీ జాగ్రత్తగా సంరక్షించారు. ఇంకా, ఆ ప్రజలకు ధర్మశాస్తాన్ని అందించింది గూడ దూతలే, గలతీయులు 3,19 ఈ విషయాన్నిధ్రువపరుస్తుంది. సైఫను యూదులతో వాదిస్తు "మీరు దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టాన్ని పొందారు" అన్నాడు - అ.చ. 7,58.

2. అన్యజాతుల మతాల్లో ఒక్క యూదుల జీవితంలోనేగాక అన్యజాతుల జీవితాల్లోను మతాల్లోను దేవదూతల ప్రమేయం వుంది. ద్వితీయోపదేశకాండ 32,8 ఈలా చెప్తుంది. మహోన్నతుడు వివిధ జాతులకు దేశాలిచ్చినపుడు, ఏ జాతులు ఎచట వసించాలో నిశ్చయించినపుడు, ఒక్కొక్కజాతికి ఒక్కొక్కదేవదూత నొసగాడు, దూతలు అన్యజాతి ప్రజల మనసులను దేవుని వైపు త్రిపుతూ వచ్చారు. వాళ్ళ మతాల్లోని సద్బోధలు వాళ్ళకు ప్రేరణం పట్టించేలా చేసారు. వాళ్ళ అన్యజాతి జనుల్లో రోమనులకు న్యాయశాస్తాన్నిచ్చారు. గ్రీకులకు తత్వశాస్తాన్నిచ్చారు. హిందువులకు జ్ఞానసంపద నిచ్చారు. ఈ యన్యజనంలో సోక్రటీసు, ప్లేటో, యోబు, మెల్కీసెడెకు మొదలైనవాళ్ళ ముఖ్యలు. ఐనా ఈ యన్యప్రజలు విగ్రహారాధనంలో పడిపోయి నిజ దేవుణ్ణిపూజించలేదు. పిశాచం వారిని అపమార్గం పట్టించింది.

3. మనుష్యావతారంలో, మనుష్యావతారమంటే దేవుడు నరలోకంలోనికి దిగిరావడం. అలా నరుల్లోకి దిగివచ్చిన క్రీస్తుని చూచి దూతలు సంతోషించారు. ఆ దైవ