పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నా స్నేహితుణ్ణి గూర్చీ అతని తోటను గూర్చీ

పాడతాను వినండి

సారవంతమైన కొండమిద

నా మిత్రునికి వో ద్రాక్షతోట వుంది

అతడు ఆ కొండమిది నేలను త్రవ్వి రాళ్లేరి

శ్రేష్టమైన ద్రాక్షలు నాటాడు.

ఆ తోటలో వో బురుజు కట్టించి

రసం తీయడానికి ఓ తొట్టికూడ తొలిపించి

పండ్ల కోసం ఎదురుచూచాడు

కాని ఆ తోట పిచ్చికాయలు కాచింది”

ఈ పాటలోని ద్రాక్షతోట యి(సాయేలు ప్రజలే, ప్రభువు ఎంత అనురాగంతో ఆదరించినా ఆ ప్రజలు ఏవో కోతి పనులు చేస్తూనే వున్నారు. ఇక్కడ ద్రాక్షతోట పిచ్చికాయలు కాచిందంటే యిస్రాయేలు ప్రజలు పాడుపనులు చేస్తున్నారని భావం - యెష 5,1-2 కీర్తనల గ్రంథం లోని కీర్తనలు చాల ఈలా పాటలుగా చెప్పిన ప్రవచనాలే.

5. రహస్యాలు వెల్లడి చేయడం

ప్రవక్తలు ఒకోమారు రహస్యాలను వెల్లడి చేస్తూ కూడ ప్రవచనం చెప్పేవాళ్ళ సిరియా సైన్యాధిపతియైన నామాను కుష్టరోగియై చికిత్స కోసం యెలీషా ప్రవక్త వద్దకు వచ్చాడు. ఎలీషా అతని కుష్టను నయం చేసాడు. నామాను కానుకలు అర్పింపబోయాడు గాని ప్రవక్త అంగీకరింప లేదు. ఇదంతా గమనించిన ఎలీషా శిష్యుడు గేహసీ పయనమైపోతూన్న నామాను వెంటబడి మా గురువు గారు కానుకలు అడుగుతున్నాడని బొంకి అతనివద్ద నుండి రూకలూ పట్టుబట్టలూ పుచ్చుకొని వచ్చాడు. తరువాత అతడు ఎలీషాకు సేవ చేయడానికి రాగా ప్రవక్త"ఓయి! నా మనసు నీ వెంటవచ్చి నీవు దురాశతో లంచాలు పుచ్చుకోవడం చూచింది. కనుక ఆ నామానుకు పట్టిన కుష్టతరతరాల వరకూ నిన్నూ నీ అనుయాయులనూ పట్టి పీడిస్తుంది పో" అన్నాడు. వెంటనే గేహసికి కుష్ట సోకింది - 2రాజులు 5,20-28, ఈలా యెలీషా దురాశకు లొంగిన సేవకుని రహస్యాన్ని బట్టబయలు చేసాడు ఓమారు యేసు సమరియా రాష్ట్రంలోని సుఖారు గ్రామంలో బావిచెంత కూర్చుండి వుండగా ఓ రంకలాడి నీళ్లకు వచ్చింది. ప్రభువు ఆమెతో "నీవు ఇంతకుముందు ఐదుగురిని కట్టుకొన్నావు. ఇప్పడున్న ఆరవవాడు కూడ నీ పెనిమిటి కాదు" అన్నాడు. ఆమె 13