పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/196

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చివరిరోజుల్లో ఆలోచించుకోవచ్చులే అనుకుంటే ఎలా కుదురుతుంది? బ్రతికి వున్నపుడే దాన్ని పట్టించుకోవాలి గదా!

మామూలుగా మన మరణసమయం భయాందోళనలతో విచారంతో నిండి వుంటుంది. అప్పుడు ప్రశాంతంగా మరణానికి సిద్ధంకాలేం. కనుక దానికి ముందుగానే తయారు కావడం వివేకం, ఇంకా పరలోక జీవితమంతా మన మరణ సమయం మీదనే ఆధారపడి వుంటుంది. కనుక మనం మంచి మరణానికి ముందుగానే సిద్ధం కావాలి.

2. మరణానికి ముందే మన జీవితాన్ని సవరించుకోవాలి. మన పాపాలను పరిశీలించి చూచుకొని వాటికి పరిపూర్ణంగా పశ్చాత్తాప పడాలి. మన దురభ్యాసాలను సవరించుకోవాలి. వేదసత్యాలను ధ్యానించుకొని ప్రార్ధనం చేసికోవాలి. బైబులు చదువుకోవాలి. దివ్యపూజ, పాపసంకీర్తనం, దివ్యసత్రసాదం మొదలైన వాటిల్లో పాల్గొనాలి రోజూ ఆత్మశోధనం చేసికోవాలి. మరియమాతా, మంచి మరణానికి పాలకులైన జోజప్పగారు మొదలైన అర్యశిష్టలను శరణువేడాలి. యేసు నామాన్ని జపించాలి. ప్రభువు మరణం మన మరణంమీద సోకి దాన్ని పునీతం చేయాలని అడుగుకోవాలి. మంచి మరణాన్ని కోరుకొనేవాడు ఈ రీతిగా భక్తిమంతమైన జీవితం గడపాలి. మామూలుగా మనం ఎలా జీవిస్తామో అలాగే చనిపోతాం. జీవితమంతా లోక వ్యామోహాల్లో గడిపేవాళ్ళు చివరి గడియల్లో దిడీలున భక్తులౌతారా?

3. దేవుణ్ణి చేరుకోవాలనుకొనేవాళ్ళ ప్రపంచ వ్యామోహాలను విసర్జించాలి. ధనం, సుఖభోగాలు, కీర్తిప్రతిష్టలు మొదలైన లోక వస్తువులమీద మోజు పెంచుకోకూడదు. చావు వచ్చినపుడు వీటిని ఎలాగూ వదలుకోవాలి. ఆ కార్యం అప్పడు మనకు కష్టంగా వుంటుంది. కనుక లోకవ్యామోహ విసర్జనం ఇప్పడే జరగాలి, చనిపోయేటపుడు కేవలం దేవునిమీదనే మనసు లగ్నంజేసికో గలిగివుండాలి. కాని ముందుగానే ప్రపంచ వ్యామోహాలను విడనాడనిదే ఈ కార్యం సాధ్యపడదు.

మామూలుగా మన లోకవాంఛలు ఎంత బలంగా వుంటాయో మన చావుకూడ అంత చేదుగా వుంటుంది. ఈ లోకాన్ని విడనాడినవాడు సంతోషంగా, ప్రశాంతంగా మరణిస్తాడు. కాని లోకవిసర్జనం మరణ సమయానికి ముందే జరగాలి.

చాలామంది భక్తలు తమ జీవితంలో ఇదే చివరిరోజు అన్నట్లుగా జీవించారు. కావున వాళ్ళ ప్రతిదినం భక్తిగా జీవించగలిగారు. ఈ సూత్రాన్ని మనంకూడా పాటించడం మేలు.

ఇంకా భక్తులు నిరంతరం మరణాన్ని ధ్యానం చేసికొనేవాళ్లు, కొందరు అర్యశిష్టలు ఎప్పడు తల పు(రే ను తమ కెదురుగా పెట్టుకొని దాన్ని మననం చేసికొనేవాళ్ళ దీనివల్ల వాళ్ల లోకవాంఛలను వదలుకొన్నారు. పాపం చేయడానికి జంకారు. ఈ సందర్భంలో సీరా గ్రంథం "ఒక దినం నీవు మరణిస్తావని నీవు చేసే కార్యాలన్నిటిలోను గుర్తుంచుకో. అప్పడు నీవు పాపం కట్టుకోవు" అని చెప్తుంది - 7, 86.