పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దయచేసేవాడు. క్రీస్తు మరణోత్థానాల తర్వాత మనం చావు నీడల్లో కూర్చుండివుండం. మృత్యుంజయుని ముఖకాంతి మనమీద ప్రకాశిస్తుంది. మానవ జాతికిచెంది మృత్యువుని గెల్చిన ఒక నరునిద్వారా మనకు శాశ్వత జీవం లభిస్తుంది.

తొలి ఆదామునందు చనిపోయే నరుడు వేరు. క్రీస్తు నందు చనిపోయేనరుడు వేరు. మన చావు ఇప్పడు మనలను శిక్షించి నాశం చేయదు. క్రీస్తుద్వారా అది మనలను రక్షించి మహిమ పరుస్తుంది. మనకు జీవాన్ని ప్రసాదిస్తుంది. కనుక మనం దాన్ని చూచి భయపడనక్కరలేదు. దాన్ని అంగీకరించవచ్చు.

3. మరణానికి తయారుకావడం

మనం జీవించి వున్నంతకాలం మన దేహాత్మలు కలిసి వుంటాయి. కాని మరణంలో ఇవి రెండూ విడిపోతాయి. ఈలా వేరయి పోవడాన్నే చావు అంటాం. లోకాంతంలో మనం ఉత్థానమైనపుడు ఇవి రెండూ మళ్లా కలిసికొంటాయి.

1. చావు ఓ గమ్యాన్ని ఏర్పరుస్తుంది.

మన ఇహలోక జీవితానికి ముగింపు మృత్యువు. చావు తర్వాత ఈ మంటిమీద మరల జీవించం. కొందరు అనుకొన్నట్లుగా పునర్జన్మలేదు. లోకంలో మన జీవితకాలం స్వల్పమైంది. కనుక మనం చేయవలసిన మంచి పనులు ఈ స్వల్ప కాలంలోనే చేయాలి. ఈ దృష్టితో చూస్తే చావు మన జీవితానికి ఓ గమ్యాన్ని ఏర్పరుస్తుంది. మనం ఎటువెళ్ళాలో, ఏమి సాధించాలో తెలియజేస్తుంది. చావే లేకపోతే నరుడు గురి తెలియనివాడుగా వుండిపోతాడు. కార్యోన్ముఖుడు కాడు.

చూవు మన ప్రధాన సమస్యల్లో వొకటి. అది మనం జయింపవలసిన చివరి శత్రువు. అయినా చాలమంది చావుని పట్టించుకోరు. మృత్యువు వచ్చి తలుపు తట్టిందాకా అది అసలు లేదో అన్నట్లు నిర్భయంగా వుండిపోతారు. ఇది వట్టి అవివేకం. బుద్ధిమంతుడు తన జీవితకాలమంతా మరణాన్ని స్మరించుకొంటూనే వుంటాడు.

2. భక్తులు చనిపోవాలని కోరుకొన్నారు

పౌలు భక్తుడు చనిపోవడం నాకు లాభదాయకం అన్నాడు. మనం క్రీస్తుతోమరణిస్తే అతనితో జీవిస్తాం -2 తిమొు 2, 21. జ్ఞానస్నానంద్వారా మనం క్రీస్తుతోచనిపోయి అతనితో జీవించడం మొదలిడతాం. క్రీస్తుతో చనిపోవడమనే ప్రక్రియ మనశారీరక మరణంతో ముగుస్తుంది. ఆ మీదట ప్రభువు రక్షణం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. కనుకనే అంటియోకయ ఇగ్నేష్యసుగారు "నేను ఈ లోకాన్నంతటిని పరిపాలించిన దానికంటే క్రీస్తులోనికి చనిపోవడం మెరుగు. మనకోసం చనిపోయిన ఆ