పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పలికాడని కూటసాక్ష్యం చెప్పించింది. అతన్ని రాళ్ళతో కొట్టి చంపించింది. ఆపిమ్మట నాబోతు పొలాన్ని అహాబు స్వాధీనం చేసికొన్నాడు, అప్పడు యేలీయా ప్రవక్త ప్రభువు ప్రేరణంతో రాజు దగ్గరికి వచ్చి "నీవు ఓ పేదవాణ్ణి చంపించి వాడి పొలాన్ని ఆక్రమించుకొన్నావు. సరే విను. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావననే నీ నెత్తురు కూడ శునకాలు ముడతాయి. కుక్కలు యెసెబెలు శవాన్ని కూడ పీకుకొని తింటాయి” అన్నాడు. తర్వాత ప్రవక్త చెప్పినంత జరిగింది- 1రాజులు 21, ఈలా ప్రవక్తలు దుర్మార్గపు పనులు చేసినవాళ్ళను మందలించేవాళ్ళు అసలు వాళ్ళకు “యిప్రాయేలు అంతరాత్మ అని పేరు. ఎప్పడైనా మనం పాడుపనులు చేస్తే మన అంతరాత్మ మనలను హెచ్చరిస్తుంది కదా! అలాగే యిస్రాయేలీయులు ధర్మశాస్రానికి వ్యతిరేకంగా కాని పనులు చేసినపుడు ప్రవక్తలు వాళ్ళను హెచ్చరించేవాళ్ళ కనుకనే వాళ్ళకు "అంతరాత్మ’ అనే పేరు సార్థకమైంది.

5. అధికారులకు సలహా యిచ్చారు

పాలస్తీనా దేశం బాబిలోనియా ఐగుప్న అనే రెండు పెద్దదేశాలకు మధ్య వున్న చిన్నదేశం. ఆవులు ఆవులు పోట్లాడు కొంటే మధ్యలో దూడలు కాళ్ళ విరిగి చస్తాయి కదా! అలాగే బాబిలోనియా ఐగుప్త పోట్లాడుకొనేప్పడెల్ల పాలస్తీనా దేశం నాశమయ్యేది. ఓమారు పై రెండు దేశాలు పోరాడుకొంటున్నాయి. యిప్రాయేలు రాజైన సిద్మియా ఐగుప్త గెలుస్తుందన్న తలంపుతో ఆ దేశపు రాజుతో సంధి చేసికోబోయాడు. కాని యిర్మీయా దైవప్రేరితుడై బాబిలోనియా గెలుస్తుందని చెప్పాడు. బాబిలోను ప్రభువైన నెబుకద్నెసరుతో సంధి చేసికొమ్మని సిద్కియాకు సలహా యిచ్చాడు. ఐనా రాజు మూరుడై ప్రవక్త సలహాను పాటింపలేదు.

ఆ రోజుల్లో హనన్యా అనే దొంగ ప్రవక్త కూడ వుండేవాడు. అతడు రాజు మెప్ప పొందగోరి ప్రభువు రెండేడ్లల్లో బాబిలోను రాజును ఓడిస్తాడని దొంగ ప్రవచనం చెప్పాడు. యిర్మీయా అతనిమిూద ఆగ్రహం తెచ్చుకొని ఈలా అబద్దాలు చెప్పి ప్రజలను అపమార్గం పట్టించినందులకు ఆయేడు ముగియక ముందే హనన్యాచస్తాడని ప్రవచించాడు, యిర్మీయా పలికినట్లే ఆ కపట ప్రవక్త ఆయేడే చనిపోయాడు - యిర్మీ28. ఈలా ప్రవక్తలు ఆనాటి ప్రజలకూ అధికారులకూ సలహా యిస్తూండేవాళ్ళు నూత్న వేదాన అపోస్తలుల కాలంలో అగబు ప్రవక్త దేశంలో కరువు వస్తుందనీ ప్రజలంతా తగిన చర్యలు తీసికోవాలనీ సలహా యిచ్చాడని ముందే చెప్పాం - అ చ 11,28–29. , క్రీస్తు తర్వాత 75లో రోమను సైన్యాధిపతి యైన టైటసు యెరూసలేమను ముట్టడించి నేలమట్టం చేసాడు. కాని క్రైస్తవ ప్రవక్తలు ఆ సంఘటనను గూర్చి ముందుగనే ప్రవచనం