పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్నీళ్లు కారుస్తూ తన్ను కాపాడమని ప్రభువుని ప్రార్థించాడు. యెషయా అప్పడే రాజుని వీడ్కొని రాజప్రాసాదం మధ్యకు వచ్చాడు. వెంటనే ప్రభువు వాణి అతనితో "నీవు మళ్ళా వెనక్కుపోయి నా భక్తుడైన హిజ్మియాతో అతడు మరణింపడని చెప్ప, నేను అతని ఆయుస్సును ఇంకా పదునైదేండ్లు పొడిగించానని కూడ చెప్ప" అంది. యెషయా ఆ సందేశాన్ని రాజుకి విన్పించాడు. అతడు చెప్పినట్లే రాజు బ్రతికాడు కూడ - 2 రాజులు 20, 1-6.

ఇదే యెషయా యిస్రాయేలును కాయలు కాయని తోటతో ఉపమించాడు. ప్రభువయిస్రాయేలీయులను ఓ ద్రాక్షతోటను లాగ గారాబంగా పెంచినా వాళ్ళ మూర్ధులై సత్ఫలితాల నీయడం లేదు. కనుక ప్రభువు వాళ్ళను దారుణంగా శిక్షిస్తాడు అన్నాడు ప్రవక్త - యెష5,7 ఈలా ప్రవక్తలు రకరకాల రూపాల్లో ప్రభు వాక్యాన్ని విన్పించేవాళ్ళ

ప్రభువుకి ప్రజల విూద కోపం వచ్చినపుడు వాళ్ళను కరువుతో శిక్షిస్తాడు. ఈ కరువు కూటికీ గుడ్డకీ గాదు. ప్రభు వాక్యానికే. అనగా ప్రవక్తలు ప్రభువు వాక్యాన్ని ప్రజలకు వీన్పించరు. ప్రభువు వాక్యం విన్చడకపోవడమనేది అన్ని కరవులకంటె పెద్ద కరవు - ఆమో 8,11,

3. ప్రజలను ప్రోత్సహించారు

ప్రవక్త పల్కిన ప్రవచనం తన నాటి జనాన్ని ప్రోత్సహించేది. వాళ్ళను కార్యాచరణకు పరికొల్పేది. బాబిలోను ప్రవాసం ముగియగా యూదులు క్రీస్తు పూర్వర 538 ప్రాంతంలో పాలస్తీనా దేశానికి తిరిగి వచ్చారు. పడిపోయిన నగర ప్రాకారాన్ని పునర్నిర్మించి దేవళాన్ని మళ్ళా కట్టడానికి పూనుకొన్నారు. కాని శత్రువులు అంతరాయం కల్గించడం వల్లా, ప్రజల్లో నిరుత్సాహం పేరుకొని పోవడం వల్లా దేవాలయ నిర్మాణం చురుకుగా కొనసాగడం లేదు. అప్పుడు హగ్గయి అనే ప్రవక్త ముందుకు వచ్చి ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ప్రభువు విమాకు చేదోడు వాదోడుగా వుంటాడు, మిరు మాత్రం వెనుకంజ వేయకుండా దేవాలయం కట్టండి అన్నాడు. దానితో నాటి రాష్ణాధికారియైన సెరుబ్బాటెలుకూ ప్రధాన యాజకుడైన యోషువాకూ పౌరులకూ ప్రేరణం కలిగింది. వాళ్ళంతా మిన్నులు ముట్టిన ఉత్సాహంలో కదలివచ్చి దేవాలయ నిర్మాణానికి పూనుకొన్నారు, దాన్ని కట్టి ముగించారు కూడ = హగ్గ l, 13-15.

ప్రవక్త చెప్పే ప్రవచనం వలన ప్రజలకు ప్రోత్సాహమూ ఆదరణమూకలుగుతాయన్నాడు పౌలు - 1కొ 14,3. సీలా, యూదా అనే ప్రవక్తలు అంతియోకయలోని క్రైస్తవులను ప్రోత్సహించి బలపరచారని కూడ వింటున్నాం - అచ 15,32