పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. తల్లి బిడ్డను ఆరోగ్యంగా వున్నప్పటి కంటె వ్యాధిగా వున్నప్పుడు ఎక్కువగా పరామర్శిస్తుంది. ఎక్కువగా సేవలు చేస్తుంది. మనంగూడ పాపాత్ములతో మెలిగేప్పడు ఈ సూత్రాన్ని పాటించాలి.

17. ఇరుగుపొరుగువాళ్ళకు మేలు కలిగినప్పడు మనం తప్పకుండా సంతోషించాలి. ఎందుకంటే వాళ్లు దేవుని పోలికగా కలిగింపబడినవాళ్లు, క్రీస్తు చిందించిన నెత్తురు వలన పాపవిమోచనం పొందినవాళ్లు, మనం ఇతరుల్లో క్రీస్తుని మాత్రమే చూడాలి. వాళ్ళ తప్పలనూ పొరపాట్లనూ గమనిస్తూ కూర్చోగూడదు, ఈ లోపాలను చూడ్డం మొదలు పెట్టామంటే మన హృదయంలో ప్రేమ ఇంకిపోతుంది, అసహ్య భావాలు కలుగుతాయి. ఇక మనం ప్రేమించవలసినవాళ్ళను ప్రేమించలేం.

18. నిరంతరం ఇతరుల తప్పలను గమనించేవాడు తన తప్పలను గుర్తించలేడు.

19. తోడినరుడు ఏదో తప్పచేసాడని తెలియగానే అతని తప్ప మనకు ఓ అద్దంలా ఉపయోగపడాలి. ఈ యద్ధంలో మన లోపాన్ని మనం బాగా పరిశీలించి చూచుకొని దాన్ని సవరించుకొనే ప్రయత్నంచేయాలి. లేకపోతే అతనికి పట్టినగతే మనకూ పట్టవచ్చు.

20. మనం త్వరపడి ఇతరుని కార్యాలను తప్పలనుగా గణించకూడదు. ఎందుకంటే ఆ పనులు చేయడంలో అతని వద్దేశం మంచిదే ఐయుండవచ్చు. బయటికి మాత్రం ఆ కార్యాలు మనకు చెడ్డవిగా కన్పించవచ్చు. ఇగ్నేష్యస్ ఎప్పడు ఈ సూత్రాన్ని పాటిస్తూండేవాడు. కనుక ఎవరైనా పలానా వ్యక్తి కార్యాలు మీరనుకొన్నట్లుగా చెడ్డవికావని వాదిస్తుంటే ఇతరులు “అతడు ఇగ్నేష్యస్ మాటలాడుతున్నాడు" అనేవాళ్ళు.

21. ఎవరైనా నిజంగా తప్పడుపనిచేస్తే, ఆ కార్యాన్ని సమర్ధించడానికి ఏ మాత్రం వీలులేకపోతే, అప్పడుకూడ అతన్ని ఖండించవదు. అతనికి ఎంత బలమైన శోధనం వచ్చి వుంటుందో ఆలోచించిచూడు. ఆ తీవ్రమైన శోధన నీకూ వచ్చినట్లయితే నీవూ అంత తప్పో లేక అంతకంటె ఇంకా పెద్ద తప్పో చేసివుండేవాడివేకదా?

22. పొరుగువాని తప్పను ఇతరులకు తెలియజేసినప్పడల్లా మన తప్పనే వెల్లడిచేసికొంటాం. ఇతరుల తప్పలను అవసరమైనవారికేగాని అనవసరమైన వారికి తెలియజేయగూడదనే విషయాన్ని ఇగ్నేష్యస్ ఖండితంగా పాటించాడు. ఒకసారి యిద్దరు గురువులు మాట్లాడుకొంటున్నారు. ఇగ్నేష్యస్ వారిని కలసికొని ఒకానొక యేసుసభ సభ్యుని లోపాలను కూర్చి మాట్లాడాడు. తర్వాత ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఆ సభ్యుని లోపాలను తెలిసికొనే అధికారం వుందని ఇగ్చేష్యస్ తట్టింది. వెంటనే అతడు నా సోదరుని