పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/126

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50. ఆ ముని యింకా ఈలా చెప్పాడు. "ఏ వస్తువు నీ హృదయం లోని కోర్కెలను తీర్చలేదో దానికి నీ హృదయాన్ని అర్పించవద్దు."

51. పోయెమన్ ముని యింకా ఈలా నుడివాడు. నీవు నీ కంటితో చూచిన దానికి సాక్ష్యమిమ్మని వేదగ్రంథం చెప్తుంది. కాని నేను చెప్పేదేమిటంటే, నీవు నీ చేతితో తాకి చూచినదానికి గూడ సాక్ష్యం ఈయవద్దు. ఒక సన్యాసి ఈలాగే మోసపోయాడు. అతడు తన ప్రక్కన వసించే మరో సన్యాసి ఓ స్త్రీతో పాపం చేస్తున్నాడని భ్రమపడ్డాడు. అతనికి పట్టరాని కోపం వచ్చింది. వాళ్ళ దగ్గరికి పోయి "ఆగండి. మిరింకా యెంతకాలం ఈలా పాపం చేస్తారు" అంటూ వాళ్ళను కాలితో ఒక్క తన్ను తన్నాడు. (వాళ్లు నరులనే అతని భాంతి!) కాని అవి ఒక దానిపై ఒకటి పడి వున్న గోదుమపంట మోపులు! కనుకనే విూరు చేతులతో తాకి చూచినదానికి గూడ సాక్ష్యమిూయవద్దని నేను ముందుగానే చెప్పాను.

52. ఆ ముని యింకా ఈలా వాకొన్నాడు. "ఇతరులకు బోధ చేయాలని చాలమంది తహతహలాడుతూంటారు. కాని తనలోని ఆశాపాశాలను అణచుకొన్న భక్తిమంతుడే గాని అన్యులను బోధ చేయడానికి అరుడు కాడు. మన యిల్ల కూలిపోతూండగా ప్రక్కవాడి యిల్ల బాగుజేయ బూనడం అవివేకం గదా?"

53. ఎవరో సన్యాసి మన పొరుగువారిని గూర్చి చెడ్డగా మాట్లాడకుండా వండాలంటే యేమి చేయాలని పోయెమన్ మునిని అడగ్గా అతడీలా చెప్పాడు. మనం వేరు, మన పొరుగువారు వేరు. నరుడు తన్ను గూర్చి తాను జాగ్రత్తగా పరిశీలనం చేసి చూచుకొని తన పాపాలకు తాను పశ్చాత్తాప పడితే, ఇతరుడు తనకంటె యోగ్యుడని తలుస్తాడు. కనుక అతన్ని గూర్చి చెడ్డగా మాట్లాడడు. కాని తన్ను తాను ఉత్తమునిగా భావించుకొంటే, అన్యుడు అతనికి తక్కువవాడు గానే కన్పిస్తాడు. కనుక అతన్నికించపరుస్తూ మాట్లాడతాడు.

54. జాన్ అనే సన్యాసి పోయెమన్ మునిని గూర్చి యిూలా చెప్పాడు. ఓసారి మేము పోయెమన్ మునిని చూద్దానికి సిరియా దేశానికి వెళ్లాం. మేము హృదయ శుద్ధిని గూర్చి ప్రశ్నింపగా అతడీలా చెప్పాడు. నీరు మెత్తగా వుంటుంది. రాయి ಗಬ್ಬಿಗ್ వుంటుంది. కాని మనం నీటి సీసాను రాతికి పైగా వ్రేలాడగట్టి దానినుండి నీరు రాతిపై బొట్లబొట్లుగా పడేలా చేసామంటే, కొంతకాలానికి ఆ బొట్ల తాకిడికి రాయి అరిగిపోతుంది, దైవ వాక్యం గూడ యిూలాగే చేస్తుంది. అది మృదువైంది, మన హృదయం కఠినమైంది. కాని పలుసారులు దైవవాక్యాన్ని వినేవాడి హృదయం దైవభీతితో నిండిపోతుంది.

55. షేటిస్ ఎడారిలో తపస్సు చేసికొనే ఓ యతి తప్పచేసాడు. అతనికి తీర్పు తీర్చడానికి అక్కడి మునులంతా ప్రోగయ్యారు. వారంతా లేచి ఆ యతి తప్పను గూర్చి మాట్లాడారు. కాని మఠాధిపతి మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు. కాసేపయ్యాక