పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/118

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాకు మనశ్శాంతి కలుగదని వాపోయాడు. ఆ మాటలు విని జలేష్యస్ దాన్ని తీసికొన్నాడు. సన్యాసి ఆ మునికి శిష్యుడై జీవితాంతం అతని వద్దనే వుండిపోయాడు.

21. దానియేలు అనే ముని ఈ సంఘటనం చెప్పాడు. బాబిలోనియాలో భక్తిమంతుడైన ఓ ధనవంతుని కొమార్తెకు దయ్యం పట్టింది. అతనికి తెలిసిన సన్యాసి వొకడు నీ కూతురుకి సోకిన దయ్యాన్నివెళ్ళగొట్టగల తాపసులు ఓ ఆశ్రమంలో వున్నారు. కాని వాళ్ల చాల వినయవంతులు. కనుక నీవడిగితే వాళ్ళ పిశాచాన్ని వెళ్ళగొట్టక పోవచ్చు. వాళ్ళ తమ వస్తువులను అమ్మకోడానికి పట్టణానికి వస్తుంటారు. నీవు వాళ్ళ వస్తువులు కొన్ని కొను. వాళ్ళకు డబ్బు చెల్లించేపుడు నీ కొమార్తె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమందాం, ఆ జపం వల్ల పిశాచం పారిపోతుంది అని చెప్పాడు. అలాగే చేద్దామని నిర్ణయించుకొని వాళ్ల సంతకు వెళ్ళిచూడగా పై తాపసుల శిష్యుడొకడు అక్కడ తామల్లిన బుట్టలను అమ్మకొంటున్నాడు. ధనవంతుడు ఈ బుట్టలు నేను సికొని నీకు డబ్బులిస్తాను రమ్మని అతన్ని తన యింటికి తీసికొని వెళ్ళాడు. కాని ఆ బాలసన్యాసిని చూడగానే దయ్యం పట్టిన యువతి ఆగ్రహం చెంది అతని చెంప వాయించింది. ఆ బాల సన్యాసి క్రీస్తు ఆదేశించినట్లే రెండవ చెంపను గూడ ఆ యువతికి చూపించాడు. వెంటనే పిశాచం క్రీస్తు ఆజ్ఞ నన్నిక్కడి నుండి తరిమి వేస్తూంది. అని అరుస్తూ ఆ యువతిని వీడి వెళ్ళి పోయింది. క్రీస్తు ఆజ్ఞలోని వినయం ఈ పిశాచం గర్వాన్ని అణచివేసింది గదా అని అనుకొని అక్కడివాళ్ళంతా దేవుణ్ణి స్తుతించారు.

22. ఎపిఫేనియస్ ఈలా నుడివాడు. "కననీయ స్త్రీ బతిమాలగా ప్రభువు ఆమె వేడికోలు విన్నాడు. రక్తస్రావంచే బాధపడే స్ర్తి మౌనంగావున్నా ప్రభువు ఆమె వ్యాధిని కుదిర్చాడు. పరిసయుడు అధికంగా మాటలాడినా ప్రభువు అతన్ని మన్నించలేదు. సుంకరి నోరు మెదపకపోయినా దేవుడు అతన్ని మన్నించాడు."

23 ఏఫేము ముని పసివాడుగా వున్నపుడే కలలో ఓ దర్శనం చూచాడు. అతని నాలుకపై ఓ ద్రాక్షలత పట్టింది. అది యెదిగి ఆకాశాన్నంతటినీ ఆవరించింది. గుత్తులు గుత్తులుగా పండ్లు కాచింది. ఎన్నో పక్షులు వచ్చి ఆ ఫలాలను ఆరగించాయి. ఐనా పక్షులు తినే కొద్దీ దాని ఫలాలు తరగలేదు కదా, ఇంకా పెరిగాయి. ఈ దర్శనం ఏ ఫేము ముని పెద్దవాడయ్యాక వ్రాయబోయే భక్తి గీతాలను సూచిస్తుంది.

24 యెషయా అనే ముని గోదుమ ధాన్యాన్నిరాలగొట్టే బద్దను తీసికొని ఓ రైతు కళ్ళానికి వెళ్ళి తనకు రాలగొట్టని గోదుమ గడ్డిని కొంత ఈయమని అడిగాడు. " రైతు అయ్యా! నీవా గోదుమ పైరును వెదబెట్టావా అని అడగ్గా, ముని లేదన్నాడు. కాపు నీవు వెదబెట్టని గోదుమ గడ్డిని నేను నీకేలా యిచ్చేది అని ప్రశ్నించాడు. ఐతే పనిచేయని