పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడిగాడు. సాధువు, ఆదరింపను. కాని నాలోని ఆత్మాభిమానాన్ని అణచుకొని నేనంటే యిష్టం లేని సన్యాసిని గూడ ఆదరంతో చూస్తాను అన్నాడు. అపుడు అబ్రాహాము "నీ జవాబులను బట్టి నీవు నీ దుర్గుణాలను ఎంతమాత్రం జయించలేదనీ వాటిని కేవలం అదుపులో పెట్టుకోగలిగావనీ మాత్రమే రుజువెతుంది" అని చెప్పాడు.

18. బెస్సారియోన్ అనే ముని యిలా చెప్పాడు. "నేను పద్నాలుగేండ్ల నుండీ నేలపై పండుకొని యెరుగను. ఎప్పడూ కూర్చుండో, నిల్చుండో మాత్రమే నిద్రపోతూ వచ్చాను."

19. బెంజమిన్ అనే ముని యాలా వాకొన్నాడు. "ఓసారి మేము షేటిస్ అనే యెడారి ప్రాంతంలో తపస్సు చేసికొనే ఓ వృద్ధుని చూడబోయాం. అతని కొరకు కొంచెం నూనె కూడ తీసుకొని వెళ్ళాం. కాని ఆ ముదుసలి అయ్యలార! విూరు మూడేండ్ల క్రితం తెచ్చియిచ్చిన నూనె సీసాను చూడండి. దానిలోని తైలం ఇంకా అలాగే వంది అని చెప్పాడు. అప్పుడు మేము అతడు ఎంత పుణ్యాత్ముడో అని విస్తుపోయాం".

20. జలేష్యస్ అనే మునికి చర్మంతో తయారుచేసిన బైబులు ప్రతి వుండేది. అది 18 వెండినాణాల ఖరీదు చేస్తుంది. అతడు ఇతర సన్యాసులు కూడ చదువుకొంటారనే భావంతో దాన్ని దేవాలయంలోనే వుంచేవాడు. ఓ దినం ఓ క్రొత్త సన్యాసి జలేష్యస్ను చూడ్డానికి వచ్చి ఆ బైబులును ఏలాగైనా తస్కరించాలనుకొన్నాడు. తాను వెళ్లేపుడు దాన్ని చంకన బెట్టకొని పోయాడు. జలేష్యస్ ఆ సంగతి గమనించి కూడ సన్యాసి వెంటబడలేదు. సన్యాసి దాన్ని పట్టణంలోని ఓ అంగడిలో 13 వెండినాణాలకు అమ్మజూచాడు. కాని అంగడివాడు అయ్యా! మొదట నన్ను దీన్ని పరిశీలించనీయి. తరువాత నీకు ఉచితమైన వెలనిస్తాను అని చెప్పాడు. కనుక సన్యాసి ఆ ప్రతిని అతని దగ్గరనే వదలిపెట్టి పోయాడు. మరుసటి రోజు అంగడివాడు ఆ బైబులును జలేష్యస్ వద్దకు కొనిపోయి బాబూ! ఎవరో ఈ పుస్తకాన్ని నా దగ్గరికి తెచ్చి దీనికి 13 నాణాలు చెల్లించమని కోరారు. ఇది అంత వెల చేస్తుందా అని అడిగాడు. జలేష్యస్, ఇది మంచి పుస్తకం. అంత ఖరీదు ఇచ్చి కొనవచ్చు అన్నాడు. కాని అంగడివాడు తిరిగిపోయి సస్యాసితో అయ్యా! నేనీ గ్రంథాన్ని జలేష్యస్ మునికి చూపించాను. అతడు ఇది మంచి పుస్తకమే గాని, 13 నాణాల వెల చేయదని చెప్పాడు అని బొంకాడు. సన్యాసి ఆతురతతో ఇంతేనా లేక జలేష్యస్ ఇంకేమైనా అన్నాడా అని అడిగాడు. అంగడివాడు అతడు ఇంకేమి అనలేదని పల్మాడు. సన్యాసి ఐతే నేను ఈ పుస్తకాన్ని నీకు అమ్మను అని చెప్పాడు. అతడు వెంటనే జలేష్యస్ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో కన్నీళ్ల కారుస్తూ విూ పుస్తకాన్ని విూరు తీసికోండి అన్నాడు. కాని ముని _ దాన్ని తిగిరి తీసికోడానికి ఇష్టపడలేదు. సన్యాసి విూ పుస్తకాన్ని విూరు తీసుకోకపోతే