పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/113

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఎడారి మునుల సూక్తులు

బైబులు భాష్యం - 92

మనవి మాట

క్రీ.శ 3 నుండి 5వ శతాబ్దం వరకు క్రైస్తవ భక్తులు చాలమంది ఈజిప్టు, సిరియా, పాలస్తీనా దేశాల పరిసరాల్లోని ఎడారుల్లోకి వెళ్లి అక్కడ ఏకాంతంగాను సామూహికంగాను గూడ సన్యాస జీవితం గడిపారు. వీరికే "ఎడారి మునులు" అని పేరు. శ్రీసభలోని నేటి మఠ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మార్గదర్శకులు వీళ్లే.

ఈ మునులు కరోరమైన నియమాలతో ఆధ్యాత్మిక జీవితం కొనసాగించారు. వీళ్ళ జీవితంలో భక్తుల స్వయంకృష్మీ భగవంతుణ్ణి పొందడానికి వాళ్ళనుభవించిన శ్రమలూ కొట్టవచ్చినట్లు కన్పిస్తాయి. వినయం, విధేయత, నిరాడంబరత, మౌనం, ఏకాంతం, దైవవాక్య ధ్యానం, ఉపవాసం - మొదలైనవి వీరిలో కన్పించే కొన్ని సుగుణాలు. వీళ్ళ లోక వ్యామోహాలను విడనాడి సువిశేష బోధల ప్రకారం నిష్టతోను భక్తి శ్రద్ధలతోను జీవించారు, వీళ్ళల్లో చాలమంది అర్యశిషులు.

ఈ మునుల ఆదర్శాలు, ఉపదేశాలు, సూక్తులు ప్రాచీన క్రైస్తవులను బాగా ప్రభావితం చేసాయి. ప్రాచీన కాలంలోనే క్రైస్తవ రచయితలు ఎడారి మునుల సూక్తుల సంకలనాలను తయారుచేసారు. ఈ చిన్ని పొత్తంలో ఆ సూక్తులను కొన్నిటిని అనువదించి ముద్రించాం. నేడు మనం ఆ యెడారి మునులంత నిష్టతో క్రైస్తవ జీవితం గడప లేకపోయినా, వారి సూక్తులూ ఆదర్శాలూ మనకు తప్పక ప్రేరణం కలిగిస్తాయి.

1. అంతోనిముని పొయెమన్ మునికి ఈలా చెప్పాడు. "నరుడు నిరంతరం తన పాపాలకు తానే బాధ్యుడనని ఒప్ప కొంటూండాలి. జీవితంలో చివరి గడియ దాకా శోధనలు వస్తూనే వుంటాయని గుర్తించాలి. ఈలా చేసేవాడు ఉత్తముడు."

2. పాంటోమని అంతోని మునిని అయ్యా! నేనేమి మంచికార్యాలు చేయాలో చెప్పమని అడగ్గా అతడీలా పలికాడు. “నీ పుణ్యం విూదనే నీవు ఆధారపడవదు. జరిగిపోయినదాన్ని గూర్చి చింతించవద్దు. నీ నాలుకనూ కడుపునూ గూడ అదుపులో పెట్టుకొంటూండు".

3. ఓ వేటగాడు ఏడారిలో అంతోనిముని ఇతర మునులతో గలసి ఆనందంగా కాలం గడుపుతూండడం జూచి విస్తుపోయాడు, మునులు ఈలా సుఖాలు అనుభవించవచ్చా