పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురువులకీ గృహస్థలకీ మధ్య విభేదాలు వైషమ్యాలు ఏమాత్రం తగ్గలేదు, కాని వాటికన్ సభ ఈ సమస్యను చాల ఉదాత్తంగా పరిష్కరించింది.


4 గృహస్తులకు మళ్ళా సరిసమానమైన హోదా లభించడం


రెండవ వాటికన్ మహాసభ బోధల ప్రకారం, దైవరాజ్య వ్యాప్తిలో గురువులతో పాటు గృహస్థలు కూడ చురుకుగా పాల్గొనాలి. ఏ దేశంలో చూచినా దైవప్రజల్లో నూటికి తొంభైతొమ్మిదిపాళ్లు గృహస్థలు. ఒక్కపాలు మాత్రం గురువులు. తొంభైతొమ్మిది శాతమైన గృహస్తులు కృషిచేయందే తిరుసభ ఏలా పెరుగుతుంది? కనుక గురువులతో కలసి గృహస్తులు కూడ దైవరాజ్య వ్యాప్తికి కృషి చేయనికాడ తిరుసభ అసంపూర్ణంగాను జీవచ్ఛవంగాను వుండిపోతుంది.


మనలను దైవప్రజలను చేసేది జ్ఞానస్నానం. ఈ జ్ఞానస్నానం ద్వారా మన మందరమూ సరిసమానంగానే తిరుసభ సభ్యులమౌతాం. కనుక మన పిలుపును బట్టి మనకు హెచ్చుతగ్గులు లేవు. కాని ఆత్మ మనలో ఒక్కొక్కరికిచ్చే సేవావరాలను బట్టి మనలో తేడాలుంటాయి. కాని యీ తేడాలవల్ల మన విలువ ఏమిరా మారదు.


నేటి తిరుసభలో మళ్లా తొలి శతాబ్దాల పద్ధతి రావాలి. దైవప్రజలందరిమధ్య సమానత్వం ఏర్పడాలి. గురువులకీ గృహస్థలకీ మధ్య విరోధం పోవాలి. తొలిరోజుల్లో క్రైస్తవ సమాజానికీ రోమను సమాజానికీ మధ్య మాత్రమే వైరుధ్యం వుండేది. అలాగే నేడు కూడ తిరుసభకీ పాపపు ప్రపంచానికీ మధ్య మాత్రమే వైరుధ్యం ఉండాలి.


నేటి తిరుసభకు కావలసిన ప్రధాన గుణం సేవ. క్రీస్తు ప్రధానంగా సేవకుడు. ఆ సేవకుని అడుగుజాడల్లో నడచే తిరుసభ కూడ సేవాసభ కావాలి. కనుక గురువులూ గృహస్థలూ అందరూ ఏకమై ఎవరి శక్తికొలది వాళ్లు దీనజనోద్ధరణకు పూనుకోవాలి. ఇవి సంగ్రహంగా గృహస్తులను గూర్చిన వాటికన్ సభ భావాలు. ఈ భావాలను పాటిస్తే గురువులకీ గృహస్థలకీ మధ్య సులువుగా పొత్తు కుదురుతుంది.


4. మన దేశ పరిస్థితి

1. క్రైస్తవ సమాజంలో గృహస్థలను లెక్కలోకి తీసికోక పోవడం, వేదబోధ పరిపాలనం మొదలైన వ్యవహారాలన్నీ గురువులూ బిషప్పలూ మొదలైన అధికార వర్గాలవాళ్ళు మాత్రమే నిర్వహించడం ప్రాత పద్ధతులని చెప్పాం. జ్ఞానస్నానం పొందినవాళ్ళందురూ దైవప్రజలే కనుక తిరుసభ సభ్యులందరూ సరిసమానమేననే భావమూ, అందరూ దైవరాజ్య వ్యాప్తికి కృషి చేయాలనే భావమూ తొలిరోజుల్లో ప్రచారంలో