పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపగారిని కొర్డినల్సూ, బిషప్పలని గురువులూ ఎన్నుకోవాలని శాసనం చేసారు. ఇప్పటినుండి క్రైస్తవ సమాజంలో పాపుగారు, చక్రవర్తి అనే యిద్దరు నాయకులు ప్రముఖులుగా తయారయ్యారు. గురువులూ, తిరుసభా, ప్రపంచమూ, ఆధ్యాత్మికరంగమూ భౌతికరంగమూ అనే విభేదాలు కూడ తలయెత్తాయి.


గ్రెగోరీ పాపగారు రూపొందించిన సంస్కరణల వల్ల తిరుసభలో గృహస్థల ప్రాముఖ్యం తగ్గింది. గురువులు బిషప్పుల ప్రాముఖ్యం హెచ్చింది. కాని ఈ గురువులూ బిషప్పలూ పవిత్ర జీవితం గడపకుండా ధనమూ పదవులూ సుఖభోగాలు మొదలైన లోక వ్యామోహాల్లో పడిపోయారు. క్రమేణ గురువులకూ గృహస్థలకూ మధ్య వైరమూ ద్వేషమూ పెరిగిపోయాయి.


16వ శతాబ్దంలో లూతరు మొదలైన ప్రోటస్టెంటు నాయకులు క్రైస్తవులకు జ్ఞానస్నాన యాజకత్వమే గాని పరిచారక యాజకత్వం లేదు అని బోధించారు. ఈ ప్రోటస్టెంటు ప్రవాహానికి అడ్డకట్ట వేయడానికి 16వ శతాబ్దంలో బ్రెంటు మహాసభ సమావేశమైంది. ఈ సభ ఆనాటి విషమ పరిస్థితుల్లో గురువుల స్థానాన్ని నిలబెట్టడానికి గృహస్థల స్థానాన్ని చాలవరకు తగ్గించింది. గృహస్థల యాజకత్వం అంత ముఖ్యమైంది కాదు అన్నట్లుగా బోధించింది. అప్పటినుండి తిరుసభలో గృహస్థల స్థానం పూర్తిగా అంతరించింది. క్రైస్తవ సమాజంలో గురువులూ మఠసభలకు చెందినవాళ్ళ మాత్రమే ముఖ్యం, గృహస్తులను ಅಣ್ಣಿ లెక్కలోనికి తీసికొనక్కరలేదు అనే భావాలు బలపడిపోయాయి. ఈలాంటి వాతావరణంలోనే 10వ భక్తినాథ పాపగారు "తిరుసభ అనే సమాజంలో రెండు భిన్నవర్గాలు వున్నాయి. కాపరులు ఒక వర్గం, మంద మరొక వర్గం. ఈ రెండూ పూర్తి విభేదం కల భిన్నవర్గాలు. మందను గమ్యానికి చేర్చే అధికారమూ హక్కూ కాపరులకు మాత్రమే వుంది. మంద బాధ్యత ఏమిటంటే, వినయ విధేయతలతో కాపరుల చేత పరిపాలించబడ్డమూ, గమ్యానికి నడిపించబడ్డమూను" అని వ్రాసారు. ఈలాంటి భావాలను నేడెవరూ అంగీకరించరు.


టెంటు మహాసభ గృహస్థల స్థానాన్నితగ్గించి గురువుల స్థానాన్ని హెచ్చించిందని చెప్పాం, ఈసభ ఆనాటి గురువుల పాప జీవితాన్ని సంస్కరించడానికి గూడ బ్రహ్మాండమైన కృషి చేసింది. ఐనా అప్పటి నుండి గురువులకీ గృహస్థలకీ మధ్య విభేదాలు పెరుగుతూనే వచ్చాయి. యూరపు దేశాల్లో గురువుల అధికారాన్ని ధిక్కరించేవాళ్ళూ, అసలు మతాధికారాన్నే నిరాకరించేవాళూ పెరిగిపోయారు. వీళ్ళ తిరుసభ నుండి వైదొలగి నాస్తిక " సంఘాలుగానో లేక లౌకిక సంఘాలు గానో ఏర్పడిపోయారు. గృహసులు చాలమంది అపమార్గాలు పట్టారు. ఇటీవల రెండవ వాటికన్ మహాసభ జరిగిందాకా తిరుసభలో