పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/102

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్యాయాన్ని పాటించడంలో విదితం కావాలి. వట్టినే గుల్లోకి వెళ్ళి జపతపాలను అర్పించడంలో గొప్పయేమిూ లేదు. అనాథులు విధవలు మొదలైన బలహీనవర్గాల వాళ్ళను పరామర్శిస్తే అది నిర్మలమైన ఆరాధనమౌతుంది.

5. గృహస్థలు ప్రాపంచిక విషయాల్లో నిమగ్నులు కావాలి

గృహస్తులను గూర్చిన వాటికన్ చట్టం సంసారికులు భౌతిక ప్రపంచాన్ని నూతీకరించాలని బోధించింది, ఇక్కడ భౌతిక ప్రపంచమంటే ఆస్తిపాస్తులు, ఆర్థిక విధానాలు, కళాసంస్కృతులు, విద్యావిశేషాలు, కుటుంబ జీవితం, వివిధ వృత్తులు, వ్యాపారాలు, సమాచార సాధనాలు, రాజకీయాలు అంతర్జాతీయ వ్యవహారాలు మొదలైనవన్నీని, భగవంతుడే వీటినన్నిటిని కలిగించాడు. కనుక ఇవన్నీ మంచివే - ఆది 1,31. ఇవన్నీ నరుని ఉపయోగం కొరకే సృజింపబడ్డాయి. నరుడు క్రీస్తునందు వీటినన్నిటినీ నూత్నపరుస్తుండాలి.

"తొలి పాప ఫలితంగా నరులు భౌతిక ప్రపంచాన్ని దుర్వినియోగం జేసూవచ్చారు, నీతినియమాలు విూరారు. కనుక నరుడు స్థాపించిన సంస్థలే నరుని వ్యక్తిత్వాన్ని నాశం చేసాయి. శాస్త్రజ్ఞలు శాస్త్రరహస్యాలకు ముగ్గులైపోయి ప్రకృతి శక్తులను అదుపులోకి తెచ్చుకోవడానికి మారుగా తామే వాటికి దాసులైపోయారు. ఈలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు భౌతిక ప్రపంచ పునర్నిర్మాణానికీ దాని సద్వినియోగానికీ పూనుకోవాలి. ఈలా పునర్నిర్మాణం గావించిన ప్రపంచాన్నితండ్రి ద్వారా క్రీస్తుకు అర్పించాలి - 1కొ 15,24.

క్రీస్తు రాజు లేక నాయకుడు. అతని లోనికి జ్ఞానస్నానం పొందినప్పడే అతని నాయకత్వం మనకు గూడ సంక్రమిస్తుంది. కాని ఈ నాయకత్వం గృహస్థ లొకరీతిగాను గురువులింకొక రీతిగాను పొందుతారు, గురువులు ఆధ్యాత్మికరంగంలో నాయకులుగా వ్యవహరించాలి. గృహస్థలు భౌతికరంగంలో నాయకులుగా వ్యవహరించాలి.

కనుక గురువులు మఠకన్యలు ప్రధానంగా పారమార్థిక విషయాల్లో నిమగ్నులు కావాలి. గృహస్థలు ప్రధానంగా లౌకిక కార్యాల్లో నిమగ్నులు కావాలి. సువార్తాసూత్రాలకూ శ్రీసభ బోధలకూ బద్దలవుతూ వీళ్ళ భౌతికరంగంలో కృషి చేయాలి.

ఈ దేశంలో క్రెస్తవులమైన మనం అల్ప సంఖ్యాకులం. మన శాతం కేవలం 2.5. ఈలా స్వల్పసంఖ్యాకులమైన మనం మన హక్కులను నిలబెట్టుకోవాలంటే విద్యను అలవర్చుకోవాలి. ప్రజాజీవనంలో కలసిపోవాలి. వివిధ వృత్తులు రాజకీయాలు మొదలైన వాటిల్లోకి ప్రవేశించాలి. వివిధ భౌతికరంగాల్లో ఉన్నత ప్రమాణాలతో కృషి చేయడం నేర్చుకోవాలి. ఐనా దురదృష్టవశాత్తు మన ప్రజలు లౌకిక కార్యకలాపాల్లో అంతగా చాకచక్యం చూపించడం లేదు. ఈ విషయంలో మనం ఇంకా మెక్కువ కృషి చేయాలి.