పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామర్థ్యాలేమిటివో గుర్తించాలి. ఆ సామర్థ్యాలతోనే క్రైస్తవ సమాజానికి సేవలు చేయడానికి ముందుకి రావాలి. మన క్యాథలిక్ సమాజంలో గృహస్తులు సేవా కార్యక్రమాలన్నిటినీ గురువుల విూదా మఠకన్యల విూదా నెట్టివేసి తాము జాగ్రత్తగా ప్రక్కకు తప్పకొంటుంటారు. ఏ పనికీ ముందుకి రారు. మాది స్వాములవారి మతం, అన్నీ మా స్వాములవారే చూచుకొంటారులే అని చెప్తారు. ఇది చాల చెడ్డ పద్ధతి. క్రైస్తవ సమాజానికి గురువు చేసే సేవలు అతడు చేస్తాడు. గృహస్తులు చేయవలసిన సేవలు వాళ్ళ చేయాలి. మన తరపున మనం పేదవాళ్ళమే కావచ్చు. కనుక తిరుసభ నుండి కొంత సహాయాన్ని ఆశించవచ్చు కాని క్రైస్తవ మతం కేవలం మనలను అభివృద్ధిలోకి తీసికొని రావడానికి మాత్రమే వుంది అనుకోగూడదు. మన తరపున మనం కూడ మనకంటె హీనులూ దీనులూ ఐన తోడి ప్రజలకు సేవలు చేసి వాళ్ళను అభివృద్ధిలోకి తీసికొని రావడానికి గూడ ఈ మతం వుందని భావించాలి.

4. క్రైస్తవ ప్రజలు పేదవర్గాలకు సాయం చేయాలి

"అనాథులను విధవలను కష్టాలలో ఆదుకోవడం, ఇహలోక మాలిన్యం సోకకుండ తన్ను తాను కాపాడుకోవడం అనే వాటినే పితయైన దేవుడు స్వచ్చము నిర్మలమూ ఐన ఆరాధనంగా భావిస్తాడు" అని చెప్మంది యాకోబుజాబు 1,27. అనాథులు, విధవలు, పరదేశులు అనే మూడు తెగలవాళ్ళ పూర్వవేదంలో బలహీనవర్గాలుగా భావించబడేవాళ్ళ - ద్వితీ 10,18. కనుకనే ప్రభువు పూర్వవేదంలో ఈ వర్గంవాళ్ళ కోప తీసికొన్నాడు. అతడు దయతో పేదల మొర ఆలిస్తాడు - కీర్త22,24 పేదవాణ్ణి దుమ్ములో నుండి పైకి లేవనెత్తుతాడు - 113,7. ఈలాంటి దీనులకే మనం సాయం చేయవలసింది.

ఇక నూత్న వేదంలో క్రీస్తు కూడ పేదలకోపు తీసికొన్నాడు. అతడు బోధించే సువార్త ప్రధానంగా పేదల కొరకు - మత్త 11,5. ధనవంతుని యింటి వాకిట పడివున్న లాజరు కథ చెప్పిన ప్రభువుకి పేదలంటే ప్రీతి - లూకా 16,19-21. అతడు ఆనాటి సమాజంలోని అట్టడుగు వర్గమైన సుంకరులతో కలసిపోయాడు, వారితో భోజనం చేసాడు. తాను పాపల కొరకే గాని పుణ్యపురుషుల కొరకు రాలేదని చెప్పకొన్నాడు — లూకా 5,29-32. అతడు ధనవంతుల కానుకలను విస్మరించి పేదరాలి రెండు కాసుల కానుకను మెచ్చుకొన్నాడు — మార్కు 12,41-44. ఈలాంటి వుదాహరణలను బట్టి ప్రభువుకి పేదలంటే యెంతో ప్రీతి అని అర్థం చేసికోవాలి. ఈ పేదలను ఆదుకోవడమే దైవరాధనమని పై యాకోబు జాబు చెప్తుంది. క్రైస్తవ ప్రజలు దేవునికి బలి అర్పించేవాళ్లు, అతన్ని ఆరాధించే యాజకులు, కాని మన ఆరాధనమనేది పేదలను ఆదుకోవడంలో వ్యక్తం కావాలి. సాంఘిక