పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన హృదయంలో విశ్వాసం జనించదు - రో 10,7. అందుకే పరిశుద్దాత్మ కూడ నాలుక రూపంలో శిష్యుల మీదికి దిగివచ్చింది - అచ 2,3. ఈ యాత్మ శక్తిని పొంది శిష్యులు నలుమూలల క్రీస్తును బోధించారు. అతని రక్షణాన్ని ప్రకటించారు. మనం కొన్ని వడకాలైనా చేసివుంటాం.గురువు నుండి కొన్నిసార్లయినా ఉపదేశం పొందివుంటాం. దీనికంతటికీ నాలుకే సాధనం.

ప్రతిక్రైస్తవ సంస్కారంలోను (దేవద్రవ్యానుమానం) రెండంశాలుంటాయి - ఓ మాట, ఓ క్రియ. ఉదాహరణకు జ్ఞానస్నానంలో "పితపుత్ర పవిత్రాత్మల పేరు మీదుగా నీకు జ్ఞాన స్నానమిస్తున్నాను" అనేవి మాటలు. నీళ్లు పోయడం క్రియ. ఇలాగే యితర సంస్కారాల్లో గూడ. ఈ సంస్కారాల్లోని మాటలన్నీ నాలుకనుండే వెలువడతాయి.

దివ్యపూజలోని ప్రార్థనలన్నీనాలుకతో ఉచ్ఛరిస్తాం. పూజలోని ప్రధాన వాక్యాలైన “ఇది నా శరీరం, ఇది నా రక్తం" అనే ప్రభు పలుకులుకూడ నాలుకతోనే ఉచ్చరిస్తాం. అందుకే భక్తుడు గ్రెగోరీ "దివ్యబిలిలోని బలిపశువు వాక్యమనే ఖడ్డంవలన ఆధ్యాత్మికంగా వధింపబడుతుంది" అని చెప్పాడు. ఇక, ఈ బలియొక్క నైవేద్యమైన దివ్య సత్రసాదంగూడ మన నాలుక మీదనే నిలుస్తుంది.

పాఠకుడు దివ్యగ్రంథాన్ని చదువుతూ తన నాలుకతో వాక్యాలను ఉచ్చరింపగా మనం వింటూంటాం. నాలుక ఇన్ని విధాలుగా ఆధ్యాత్మిక జీవితంలో మనకు మేలు చేస్తుంది. ఆలాంటి ఈ యవయవాన్ని అనుగ్రహించినందులకు దేవునికి కృతజ్ఞలమై యుండాలి. ఈ యవయవాన్ని చక్కగా వాడుకొని ఆ దేవునికి సంతోషాన్ని చేకూర్చాలి.

3. నాలుక చెడ్డపనికీ ఉపకరిస్తుంది

నాలుక మంచికి ఉపకరిస్తుందన్నాం. కాని దురదృష్టవశాత్తు చెడ్డకు గూడ ఉపకరిస్తుంది. “జీవమూ మరణమూ నాలుక అధీనంలోవున్నాయి" అంటుంది సామెతల గ్రంథం - 8,21. దాన్ని చక్కగా వాడుకొంటే జీవమూ, చెడ్డగా వాడుకొంటే మరణమూ లభిస్తాయి. యాకోయి జాబు నాలుకను ఓ నిప్ప రవ్వతో పోలుస్తుంది. చిన్న నిప్పరవ్వ పెద్ద అడవిని కాల్చివేస్తుంది. అలాగే నాలుకకూడ చిన్న అవయవమైనా మనదేహాన్నంతటినీ భస్మం చేస్తుంది - 8,5. తెలుగుకవి నన్నయభట్టు ఓతావులో "వాక్పారుష్యము చన్నె మహాదారుణమది విషయముకంటెను దహనము కంటెన్" అన్నాడు.

జీవితంలో ఎవరో వొకరు ఎప్పుడో వొకప్పుడు మనల నుద్దేశించి చాలా నిర్దయగా మాటలాడి వుంటారు. ఆ మాటలు మన హృదయాన్ని కత్తితో పొడిచినట్లుగా బాధించి వుంటాయి. వేరొకరు కోపంతో మనమీద మండపడివుంటారు. చెడబడ తిట్టి వుంటారు. ఆ పలుకులు మనలను కత్తితో పొడిచినట్లుగా వేధించి వుంటాయి, కొంతమంది పాడుమాటలు చెప్పి కలిసిమెలిసి వుండే కుటుంబాలను వేరుచేయిస్తుంటారు, పండంటి