పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. సోదర ప్రేమ-1

బైబులు భాష్యం - 12

విషయసూచిక

1. సోదరప్రేమ విలువ

74

2. తలపుల్లో సోదరప్రేమ

80

3. మాటల్లో సోదరప్రేమ

83

4 చేతల్లో సోదరప్రేమ

86

5, క్షమాపణ గుణం

89

6. పౌలు బోధ

91

- ఉపసంహారం

1. సోదర ప్రేమ విలువ

1. క్రీస్తు రెండాజ్ఞలను బోధించాడు

ఓమారు ధర్మశాస్త్రజ్ఞడొకడు క్రీస్తుని సమీపించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ప్రశ్నించాడు. క్రీస్తు సమాధానం మార్కు 12, 28-34 వచనాల్లో చూడవచ్చు. ఈ వచనాలు పలుసారులు చదువుకోదగ్గవి. ఈ సమాధానంలో నాలుగంశాలను గుర్తించాలి. 1. ధర్మశాస్త్రజ్ఞడు ప్రధానమైన కట్టడను ఒక్కదానిని పేర్కొనమనగా క్రీస్తు, ఒకటిగాదు రెండు కట్టడలను పేర్కొన్నాడు. మొదటిది, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. రెండవది, నీవలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. క్రీస్తు ఈలా రెండు కట్టడలను పేర్కొనడం దేనికంటే ఇవి రెండూ చాలా దగ్గర సంబంధం కలవి. దైవప్రేమకు తుల్యమైనది మానవప్రేమ. (2) మొదటి ఆజ్ఞకు సమానమై రెండవ ఆజ్ఞ సోదర ప్రేమ అంటాడు క్రీస్తు, దైవప్రేమ ముఖ్యాతి ముఖ్యమైంది. దానికి తుల్యమైంది సోదరప్రేమ. (3) వీటికి మించిన ఆజ్ఞలు మరేమీ లేవు. మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ ఒంకెమీద గుడ్డలు వ్రేలాడినట్లుగా, ఈ రెండాజ్ఞలమీద వ్రేలాడుతూంటాయి - మత్త 22,40. (4) ఈ రెండ్మాజ్ఞలను పాటించడం దహన బలులను సమాధాన బలులను సమర్పించడం కంటె యోగ్యమైన కార్యం.

ఈ క్రీస్తు సమాధానాన్నిబట్టి దైవప్రేమ సోదరప్రేమ రెండూ సమానమైన కట్టడలని భావించాలి. అసలు ఇవి రెండూ ఒకే కట్టడ. రెండు విధాలుగా చెప్పబడ్డాయి. ఒకే చెట్టు నుండి చీలిన రెండు కొమ్మల్లాగ, ఒకే కాడపై పూచిన రెండు గులాబీ పూవుల్లాగ, ఒకే నీటి బుగ్గ నుండి వెలువడిన రెండు పాయల్లాగ ఈ రెండాజ్ఞలూ ఒకే ప్రేమాజ్ఞ నుండి పుట్టాయి.