పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైవసాన్నిధ్యమూ తెలియదు. కాని మనం దేవుణ్ణి తెలిసికొని అతని సన్నిధిలో మెదలేవాళ్ళం. ఇంకా ప్రభువు "దుప్ర్కియలు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన దుప్రియలు బయటపడతాయి కనుక అతడు వెలుగుని సమీపింపడు" అన్నాడు - యోహా 8,20. మనం దుప్ర్కియలు మాని వెలుగుని సమీపించేవాళ్ళం కావాలి. ఇక్కడ వెలుగంటే క్రీస్తే కనుక ఆ ప్రభువు సన్నిధిలో జీవించేవాళ్ళం కావాలి.

మనం దైవసాన్నిధ్యాన్ని తలంచుకొని పాపం మానుకోవాలి. అతడు మహాపవిత్రుడైన ప్రభువు. పాపాన్ని ఏ మాత్రం సహించనివాడు. అంత పవిత్రుడైన ప్రభువు సమక్షంలో మనం పాపం చేయడానికి ఏలా సాహసిస్తాం? పూర్వం పోతీఫరు భార్య యోసేపని పాపానికి పూరికొల్పింది. ఆ భక్తుడు నేనీ దుష్కార్యానికి పాల్పడిదేవునికి ఏలా ద్రోహం చేసేది అన్నాడు - ఆది 39,9. దేవుని సన్నిధిలో నడచే నరునికిగూడ శోధనలు వస్తాయి. కాని దైవబలంతో అతడు శోధనలను జయిస్తాడు. దేవునిపట్లగల భయభక్తులతో పాపంనుండి తప్పకొంటాడు. ప్రభువు మనలోని ప్రతివాణ్ణి ఈ లోకంలో మన మొక్కరమే ఉన్నామో అన్నట్లుగా నిశితంగా పరిశీలిస్తాడు. మన చేతలూ ఆలోచనలూ పనులూ అన్నీ జాగ్రత్తగా గమనిస్తాడు. కనుకనే కీర్తనకారుడు

“దేవుడు ఆకాశంనుండి నరులను పరీక్షించి చూస్తుంటాడు
ఎవరైనా జ్ఞానం కలిగి తన్ను పూజిస్తున్నారా అని
పరిశీలించి చూస్తుంటాడు"

అన్నాడు –53,2. ఆలాంటి దేవునిపట్ల మనం ఎంతో జాగ్రత్తతో మెలగాలికదా? పెద్దతెరేసమ్మగారు ఓ పర్యాయం దేవుని ముందట నిల్చియున్న ఓ పాపి ఆత్మను చూచారు. ఆ యాత్మ ఎంతో వికృతంగావుండి ఆమెకు భయమూ రోత పుట్టించింది. అలాంటి జుగుప్సాకరమైన దృశ్యాన్ని చూడలేక ఆమె మూర్చపోయినట్లయింది. పాపంపట్ల ఆ పవిత్రురాలికి కల్గిన ఏవగింపు మనకుకూడ కలిగితే ఎంత బాగుంటుంది!

4. అంతటావుండే దేవుణ్ణి ప్రేమించాలి

దేవుడు ప్రేమస్వరూపుడు - 1యోహా 4,16, ప్రేమమయుడైన ఆ దేవుడు మన హృదయాల్లో వసిస్తూంటాడు. మన యెడదలనుగూడ ప్రేమతో నింపుతూంటాడు. ఆ ప్రభువు మనకు దయచేసిన ప్రేమతోనే మనం అతన్ని ప్రేమించాలి. ఐనా దేవుణ్ణి ప్రేమించే నరులు కొద్దిమందే. భగవంతుణ్ణి అతని సాన్నిధ్యాన్నీ అనుభవానికి తెచ్చుకొన్న మహానుభావులు మాత్రం అన్నివస్తువుల్లోను ఆ ప్రభువుని దర్శిస్తారు. అన్ని వస్తువులనూ అతనియందు దర్శిస్తారు. అలాగే అన్నివస్తువుల్లోను అతన్ని ప్రేమిస్తారు. అన్నిటినీ అతనియందు ప్రేమిస్తారు.