పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పక్షాలవాళ్లూ ఇకమీదట ఏకప్రాణంతో జీవిస్తారని భావం. అనగా ఈ నెత్తురు దేవుని ప్రాణాన్ని ప్రజల ప్రాణాన్ని ఐక్యంజేస్తుంది. వాళ్ళిద్దరకూ కలయికా, పొత్తూ ఏర్పడేలా చేస్తుంది. ఈ విధంగా నిబంధన రక్తం ఐక్యతను సూచిస్తుంది. దేవునితో మనం కూడ ఐక్యమయ్యే భాగ్యం కోసం మనవిచేద్దాం.

37. దివ్య భోజన వాక్యాలు

క్రీస్తు చిందించిన రక్తం గూడ పై నిబంధనరక్తం లాంటిది అంటుంది నూతవేదం. కనుక యీ నూత్నవేద వాక్యాలను విలోకిద్దాం. ప్రభువు దివ్య భోజనాన్ని నెలకొల్పినప్పటి వాక్యాలు నాలుగున్నాయి అవి మత్త26, 28 మార్కు 14,24 లూకా 22, 19–20, 1 కొ11, 25-27. ఈ నాల్లు వాక్యాల్లోను "ఇది నిబంధనరక్తం" అనే పలుకులు విన్పిస్తాయి. మోషే నెత్తురు ప్రజల మీద చల్లి "ఇది యావే మీతో చేసుకొన్న నిబంధన రక్తం" అన్నాడు గదా! నిర్ణ - 24,8 అక్కడ జంతువుల నెత్తురును చిలకరించడం ద్వారా సీనాయి నిబంధనం యేర్పడింది. ఇక్కడ మళ్ళా క్రీస్తు నెత్తురును చిందించడంద్వారా నూత్న వేదపు నిబంధనం యేర్పడింది. అక్కడ సీనాయి నిబంధన ద్వారా ప్రజలు యావేతో ఐక్యమయ్యారు, యావే ప్రజలయ్యారు. ఇక్కడ కల్వరి నిబంధనం ద్వారా మనమూ క్రీస్తుతో ఐక్యమౌతాం. క్రీస్తు ప్రజలమౌతాం. నిబంధనం ఎప్పడూ రెండు పక్షాలవారిని ఐక్యపరుస్తుంది. క్రీస్తు చేసుకొనిన ఈ రెండవ నిబంధనను గూర్చి మననం చేసికుందాం.

38. క్రీస్తు రక్తం మనలను కొంది - దర్శ 5,9.

సీనాయి కొండవద్ద చిలకరింపబడిన నెత్తురు ద్వారా యిస్రాయేలీయులు యావే ప్రజలయ్యారన్నాం. ෂඥf. క్రీస్తు చిందించిన రక్తంద్వారా మనం క్రీస్తుప్రజల మౌతాం. అంచేతను నూత్న వేదంలోని చాలా వాక్యాలు క్రీస్తు రక్తం మనలను కొందనీ, మనం క్రీస్తు సాత్తయ్యామనీ చెప్తాయి. 1 పేత్రు 2, 9 మనం దేవుని సాత్తయిన ప్రజలం అంటుంది. అచ 20,28లో క్రైస్తవులు క్రీస్తు స్వీయరక్తమిచ్చి సంపాదించిన సమాజమని చెప్పబడింది. దర్శనగ్రంథం 5,9లో క్రీస్తును గూర్చి "నీవు వధింపబడిన వాడవు. నీ రక్తమిచ్చి ప్రతిజనమునుండి మా దేవుని కొరకు ప్రజలను కొన్నావు" అని చెప్పబడింది. 1 కొరి 6, 20 మరియు 7, 28 మనం విలువ పెట్టి కొనబడినవాళ్లం అని చెపాయి. ఈ వాక్యాలన్నిటిలోను సీనాయిరక్తం ఏం చేస్తుందో క్రీస్తు రక్తమూ అదే చేస్తుంది అనేభావం ఇమిడివుంది. అనగా మనలను దేవుని ప్రజలనుగా, దేవుని ఆస్తినిగా చేస్తుంది క్రీస్తు నెత్తురు. కనుక ఆ ప్రభువు ప్రజల్లా జీవించే భాగ్యం అడుగుకుందాం.

39. గొర్రెల కాపరియైన యేసు - హెబ్రే 13,20

క్రీస్తు మనకు కాపరి. మనం అతడు మేపే గొర్రెల్లాంటి వాళ్ళం. బైబుల్లో కాపరి అంటే నాయకుడని అర్థం. కనుక క్రీస్తు మనకు నాయకుడు. నిబంధన సంబంధమైన తన నెత్తురుద్వారా మనలను ఆర్థించినవాడు. మనం అతని ప్రజలం. జకర్యా 9, 11