పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిశాచదాస్యాన్నుండి విమోచించాడు. మనమూ ఈ విమోచనానికి పాత్రులం కావాలని అడుగుకుందాం.

18. స్వకీయ సంపాద్యం - నిర్గ 19,5 .

మీదటియంశాల్లో ప్రభువు విమోచకుడని చూచాం. ఇక "క్రయధనం" అనే మాటను చూడాలి. పైన ఉదాహరించిన మార్కు వాక్యంలో క్రయధనం అనే శబ్దాన్ని గుర్తించాం గదా! ఏమిటి ఈ క్రయధనం? కొనడానికి వెచ్చించే డబ్బు క్రయధనం, పేదయూదుల పొలముపట్ర అమ్ముడుపోతే దగ్గరి బంధువులు ఆ యాస్తిని స్వాధీనం జేసికున్న యజమానునికి ధనమిచ్చి దాన్ని వదలిపెట్టించేవాళ్ళ అన్నాం. ఈలా సమర్పించిన ధనాన్నేక్రయధనమనేవాళ్ళ అనగా ఆ పొలాన్ని విడిపించడం కోసం చెల్లించిన సొమ్ము అన్నమాట. ఇక, యావేగూడ ఫరో బానిసానికి అమ్ముడుపోయిన తన ప్రజలను విడిపించాడు, తిరిగి కొన్నాడు. అందుచేత ఆ ప్రజలు అతనికి "స్వకీయ సంపాద్యం" అయ్యారు- నిర్గ 19,5. అనగా అతని సొంతసొత్తు అయ్యారు. అంతకు ముందు వారు ఫరోసాత్తు, ఇకమీదట యావే సాత్తుగా మారారు. ప్రభువు ఫరో దాస్యాన్నుండి ప్రజలను విడిపించడం విమోచనం. అలా విడిపించిన ప్రజలను సొంత సొత్తుగా జేసికోవడం సంపాద్యం. ఈ విమోచన సంపాద్యాలు రెండూ ఒకే కార్యంగా భావించాలి. ఇక, యావే ప్రభువు ఫరో చక్రవర్తి దాస్యాన్నుండి ప్రజలను విడిపించినపుడు అతనికి క్రయధనం చెల్లించాడా? యావే ప్రభువు ప్రజలను విడిపించాడు లేక కొన్నాడు అంటుంది బైబులు. అంతవరకే పేదవాళ్ళ ఆస్తిని విడిపించడమనే ఆచారంతో ఉపమానం. కాని ఫరో చక్రవర్తికి యావే క్రయధన మిచ్చాడని బైబులు ఎక్కడా చెప్పదు. ఇక్కడ పై యాచారంతో ఉపమానం చెల్లదు.

19. మీరు విలువబెట్టి కొనబడినవాళ్లు - 1 కొ 6, 20.

1 కొరింతీయులు 6,20 లోను 7,28 లోను క్రైస్తవులు "విలువ బెట్టి కొనబడినవాళ్ళు" అని చెప్పబడింది. ఏమి విలువ? పూర్వవేద ప్రజలు ఫరో చక్రవర్తికి దాసులైయుండగా యావే ప్రభువు వాళ్ళను విడిపించాడు. అలాగే నూత్న వేద ప్రజలు పిశాచమనే చక్రవర్తికి దాసులమయ్యారు. క్రీస్తు ప్రభువు ఈ ప్రజలను దాస్యానుండి విడిపించాడు. యావే యిప్రాయేలీయులను ఫరో అనే యజమాను నుండి కొన్నట్లే క్రీస్తు కూడ మనలను పిశాచమనే యజమాను నుండి కొన్నాడు. ఈలా కొనడానికి క్రీస్తు అర్పించిన క్రయధనం "అతని నెత్తురే ఈలా క్రీస్తు నెత్తురు ధారవోసి పిశాచం చేతుల్లో నుండి మనలను విడిపించాడు కనుకనే మనం "విలువబెట్టి కొనబడినవాళ్ళం" అయ్యాయి. ఇక, క్రీస్తు దయ్యానికి తన నెత్తురును క్రయధనంగా అర్పించాడా? యావే ఫరోకు క్రయధన మర్పించినట్లుగా పూర్వ వేద మెక్కడా చెప్పదన్నాం. ఆలాగే క్రీస్తు దయ్యానికి నెత్తురు