పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపులకు రక్షణం అనుగ్రహించాడు - లూకా 19,9. తప్పిపోయి ముండ్లపొదల్లో చిక్కువడిన గొర్రెల్లాంటి పాపులను భుజాలమీద మోసికొని వచ్చాడు -15, 5. కుష్టరోగుల్లాంటి వ్యాధిగ్రస్తుల బాధలు మాని కాపాడాడు - 17, 19. మనపట్లా యీ ప్రభువు రక్షకుళ్ళా వ్యవహరించాలని మనవి చేద్దాం.

8. యేసు నామంమీదుగానే రక్షణం - అచ 4, 12.

యేసు చనిపోయేప్పుడూ రక్షకుడుగానే వ్యవహరించాడు. ఓమారు అతడు "ప్రాణాన్ని దక్కించుకొనేవాడు పోగొట్టుకుంటాడు, పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడు" అని బోధించాడు - మత్త 10,39, ఈ బోధ ప్రకారమే మనకోసం తన ప్రాణాలను బలిగా అర్పించాడు - యోహా 10, 15 ఈ క్రీస్తు ఆత్మార్పణం ద్వారా యావే ప్రభువు మళ్ళా తన ప్రజను రక్షించాడు. నాటి ఐగుప్తు లాంటిదే యీ రక్షణం గూడ - యోహా 3,16. కనుకనే క్రీస్తు ఉత్థానానంతరం పేత్రు, యేసు నామంమీదుగా దప్పితే మరియే నామంమీదుగా గూడ యిక రక్షణం లభించదు అని వుపన్యసించాడు - అచ 4, 12. అనగా పిత లోకానికి నిర్గమించిన యేకైక రక్షణం యేసునామం, యేసు అనేవ్యక్తి మనమూ నిత్యం ఈ నామాన్ని నమ్మకొని బ్రతికే భాగ్యంకోసం ప్రార్థిద్దాం.

2,

9. అతడు సమస్త దుర్నీతినుండి మనలను విమోచించాడు - తీతు 14

క్రీస్తు మనలను దేన్నుండి రక్షించినట్లు? సమస్త దుర్నీతినుండి. అనగా సమస్త పాపాన్నుండి. పూర్వవేదంలోని ప్రభువు యూదులను ఐగుప్ననుండి, అచటి విగ్రహారాధనమనే పాపాన్నుండి రక్షించాడన్నాం. అదేవిధంగా ఈ నూత్నవేద ప్రభువుగూడ మనలను పాపాన్నుండి రక్షిస్తాడు. అచటి ప్రజలు ఐగుప్త ప్రభువైన ఫరోకు బానిసలు, మనం పిశాచమనే మరో ప్రభువునకు, అతడు తెచ్చిపెట్టే పాపానికి బానిసలం. క్రీస్తు ఈ పిశాచ దాస్యాన్నుండి మనలను విముక్తి చేసాడు. ఐగుప్త విమోచనం తర్వాత యూదప్రజలు యావే సొత్తు అయ్యారు. యావే ప్రజగా పరిగణింపబడ్డారు. క్రీస్తు మరణం తర్వాత మనమూ క్రీస్తు సొత్తఔతాం, క్రీస్తు ప్రజగా తయారౌతాం. మనం క్రైస్తవులం అని చెప్పకుంటాం. అనగా క్రీస్తునకు చెందిన ప్రజలం, అతన్నునుసరించే ప్రజలం, ఈ భావాన్ని చక్కగా జీర్ణంజేసికునే భాగ్యం అడుగుకుందాం.

10. నోవా ఓడ - 1 పేత్రు 3,20

కాని క్రీస్తు ఆర్థించిన ఈ రక్షణంలో మనమేలా పాలు పొందుతాం? రెండు కార్యాలద్వారా, మొదటిది, ప్రభువునందు విశ్వాస ముంచడం వలన. పౌలు ఫిలిప్పిలోని 30