పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/269

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126. ప్రవాస విముక్తుల పాట

ప్రవాసం నుండి తిరిగివచ్చాక క్రీ.పూ. 520 ప్రాంతంలో యూదులు తమ దేవాలయాన్నీ నగరాన్నీ పునర్నిర్మించుకోవడం ప్రారంభించారు. వాళ్ళకు ప్రవాసకాలం బాధనీ ఈ విడుదల కాలం సంతోషాన్నీ కలిగించాయి. ప్రవాసం ముగిసాక విడుదల కాలంలో చెప్పిన గీతం ఇది. కీర్తనకారుడు పూర్వబాధనూ ప్రస్తుత సంతోషాన్నీ తలంచుకొంటున్నాడు. అతడు ఎండిపోయిన యేరు వాననీటితో నిండినట్లుగా మమ్మ మళ్ళా సంతోషచిత్తులను చేయమని దేవుణ్ణి అడిగాడు. దుఃఖంతో వెదవెట్టిన వాళ్లు సంతోషంతో పంట కోసికొంటారని చెప్పాడు. కష్టాలు తొలగి సుఖాలు ప్రాప్తించినపుడు చెప్పకోదగిన ప్రార్ధన యిది.

127. దేవునిపై నమ్మకం

ఇది జ్ఞాన కీర్తనం. దీనిలో రెండంశాలున్నాయి. మొదటిది, ప్రభువు ఇల్లు కట్టకపోతే ఇల్లు లేవదు. అతడు పట్టణాన్ని కాపాడకపోతే పట్టణం నిలువదు. మన ఆందోళనం వల్ల మనమేమీ సాధించలేం. ప్రభువు తోడ్పాటువల్ల సాధిస్తాం. కనుక ప్రభువు సాయం అవసరం. రెండవది, బిడ్డలను దయచేసేవాడు ప్రభువే. అతడు ప్రసాదించిన బిడ్డలు ఎదిగివచ్చి తల్లిదండ్రులను ఆదుకొంటారు. మనం దేవుని తోడ్పాటు కొరకు వేడుకోవాలి. దేవుడిచ్చిన బిడ్డలను చూచి సంతోషించాలి. ఈ రెండు భాగ్యాల కొరకు ప్రార్థిద్దాం.

128. భక్తిమంతుల కుటుంబాలకు దీవెనలు

ఇది కుటుంబ జీవితాన్ని ప్రశంసించే కీర్తన. ప్రభువు ఆజ్ఞల ప్రకారం జీవించే భక్తిమంతుడు పెద్ద కుటుంబంతో అలరారుతాడు. అతని యింటిలో భార్య బిడ్డలను చంకకెత్తుకొని పండ్లగుత్తులు కాసిన ద్రాక్షతీగలా వుంటుంది. అతని బిడ్డలు భోజనం బల్లచుట్ట తిరుగుతూ ఓలివుచెట్టు పిలకల్లా వొప్పతారు. అతడు మూడు తరాలవరకు తన బిడ్డలను చూస్తాడు. యెరూషలేము జనసంఖ్య పెరగడం కూడ గమనిస్తాడు. ప్రాచీనకాలపు జనులందరూ సంతానాన్ని జనసంఖ్యనీ దేవుని దీవెనగా భావించారు, గృహాలను సందర్శించి కుటుంబాలను దీవించేపుడు ఈ కీర్తనను జపించడం మంచిది.

129. శత్రుపరాజయం కొరకు ప్రార్ధనం

శత్రుపీడనం నుండి యిప్రాయేలును కాపాడమని ఈ కీర్తనంలో కవి దేవునికి మనవి చేసాడు. విరోధులు యూదులను బాధించారు. వారి వీపుని పొలాన్నిలాగదున్నారు. ఐనా వాళ్ళను ఓడించలేకపోయారు. ప్రభువే విరోధుల బారినుండి వారిని కాపాడాడు. నేడు సమాజంలో