పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/267

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుని స్తుతిస్తాను అన్నాడు. నరమాత్రులను నమ్మడం కంటే దేవుణ్ణి నమ్మడం మేలు అన్నాడు. దేవుడు మనకు దయచేసిన భాగ్యాలకు అతనికి వందనాలు చెప్పకొందాం.

119. ధర్మశాస్త్ర స్తవం

ఇది కీర్తనలన్నిటిలోను పెద్దది. దీనిలోని అంశం ధర్మశాస్త్ర స్తుతి, ధర్మశాస్త్ర మంటే ప్రభువు ఆజ్ఞలు, అతని వాక్కు ఆ వాక్కును పాటించేవాళ్ళ నిజమైన భక్తులు దేవునిపట్ల మనకుండే ప్రేమను అతని ఆజ్ఞలను పాటించడం ద్వారా రుజువుచేసికోవాలి. దేవుని ఆజ్ఞలను మీరడమే పాపం. మనం ఈ పాపానికి దూరంగా వుండాలి. ఈ కవి చెప్పినట్లు ప్రభువు వాక్యం వెండి బంగారాలు, నిధి, తేనె, దీపం. మన వాక్యభక్తి ఏపాటిది? మనం పవిత్ర గ్రంథాన్ని ఎంత ప్రీతితో చదువుతాం? ఈ కీర్తన చెప్పినట్లుగా "ప్రభు! నీవు నా కన్నులు తెరువు, నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుత విషయాలను గ్రహిస్తాను" అని ప్రార్థిద్దాం.

120. శాంతికి శత్రువులు

ఈ కీర్తనను చెప్పిన భక్తుడు ఏదో సందర్భంలో అన్యజాతి ప్రజల నడుమ వసించాడు. వాళ్ళ దుపులు, కలహప్రియలు. కనుక అతనికి ఆ ప్రవాస జీవితం భారమనిపించింది. అతడు నేను ఎప్పడెప్పడు యెరుషలేము చేరి ప్రభుని దర్శించి శాంతిని పొందుతానా అని ఉవ్విళూరి పోయాడు. మనం ఈ లోకమనే ప్రవాసంలో వున్నాం. శాంతి నిలయమైన మోక్షాన్ని చేరుకొనేదాకా మనకు విశ్రాంతిలేదు.

121. యిప్రాయేలుని కాపాడేవాడు

120-134 వరకు వచ్చేవి యాత్రిక కీర్తనలు, యూదులు యెరూషలేమకి యాత్ర చేసేపుడు పాడేవి. ఈ గీతం కూడ భక్తుడు పవిత్ర నగరానికి యాత్ర చేస్తూ పాడిందే. త్రోవలో ప్రభువే అతన్ని కాచి కాపాడతాడు. ఆ ప్రభువు భక్తులకు కాపలా కాసేవాడు, గొర్రెల కాపరిలాంటివాడూను. అతడు ఏనాడు కునికిపాట్లు పడడు, ఏనాడు నిద్రపోడు. అతడు కీర్తనకారుడ్డి సురక్షితంగా యెరుషలేముకి తీసికొనిపోతాడు. మళ్ళా భద్రంగా యింటికి తీసికొనివస్తాడు. మన తరపున మనం ఈ లోకం నుండి పరలోకానికి యాత్ర చేస్తుంటాం. మన రాకపోక లన్నిటిలోను ప్రభువు మనలను కాపాడాలని అడుగుకొందాం.

122. యెరుషలేమకి శుభం

ఈ యాత్రిక కీర్తనలో భక్తుడు యెరుషలేములో వున్నాడు. అక్కడి నుండి మళ్ళీ ఇంటికి తిరిగిరాబోతున్నాడు. తాను యెరుషలేముకి రాకముందు తన గ్రామంలోని జనం "మనం ప్రభుమందిరానికి యాత్ర వెళ్లాం" అని పల్కారు. ఆ పలుకులు గురుతుకు రాగానే