పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/266

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

115. నిక్కమైన దేవుడు ఒక్కడే

ఈ కీర్తనను యూదులు ప్రాయశ్చిత్త దినాన పాడేవాళ్ళ దేవుడు తమ పాపాలకు తమ్మ దండించాడనీ, ఆ దండనం ఉచితమైనదేననీ ఒప్పకొని దేవుణ్ణి స్తుతించేవాళ్లు, నరులను రక్షించేది దేవుడొక్కడే విగ్రహాలకు ఆ శక్తి లేదు. అవి వట్టి బొమ్మలు, నిర్జీవ ప్రతిమలు, శక్తిరహితాలు. నరమాత్రులకుగాని విగ్రహాలకుగాని మహిమ తగదు. సర్వశక్తిమంతుడైన ప్రభువు కొక్కడికి మహిమ తగుతుంది. అతడొక్కడే నిక్కమైన దేవుడు.

116. వందన సమర్పణం

దేవుడు భక్తుణ్ణి మరణాపాయం నుండి కాపాడాడు. భక్తుడు దేవళానికి వచ్చి ఆరాధన సమాజం ముందు ప్రభువుని స్తుతించాడు. ఆ స్తతే ఈ కీర్తన. ప్రభువు జాలి కలవాడు. కనుక కీర్తనకారుని విన్నపాన్ని ఆలించాడు. అతన్ని మృత్యువునుండి కాపాడాడు. కనుక భక్తుడు అతన్ని మనసార స్తుతించి కీర్తించాడు. ఇది హలెల్ కీర్తనల వర్గానికి చెందింది. ఈ పాటలు ప్రధానంగా దేవుణ్ణి స్తుతించేవి. కీర్తనకారుడు పీఠం ముందు ద్రాక్షసారాయాన్ని ధారగాపోసి దేవుణ్ణి మరీ స్తుతించాడు. భక్తిమంతుల మరణాన్ని ప్రభువు అంగీకరించడని నమ్మకంతో చెప్పకొన్నాడు. భక్త్యావేశంతో అయ్యా! నీవు నన్ను చావునుండికాపాడావు. నేను నీ దాసుడ్డి, నీ దాసురాలి కుమారుడ్డి నీకు వందనాలు - అని యెలుగెత్తి అరచాడు. ఇది భక్తిగల కీర్తన. దేవుడు మనకు చేసిన ఉపకారాలకు అతన్నిస్తుతించాలి. భక్త సమాజంలో ఆ వుపకారాలను వివరించి చెప్పడం గూడ మంచిది.

117. ప్రభువుకి స్తుతి

ఇది స్తుతిగీతం. 150 కీర్తనల్లోను చిన్నది. దీనిలో భక్తుడు అన్యజాతి ప్రజలను ప్రభుని స్తుతించడానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ స్తుతికి కారణాలు రెండు. మొదటిది, దేవునికి నరులపట్ల వుండే ప్రేమ మిక్కుటమైంది. రెండవది, దేవుడు తాను చేసిన నిబంధన ప్రమాణాలకు కట్టవడివుండేవాడు. అనగా నమ్మదగినవాడు. ఈలాంటి దేవుణ్ణిస్తుతించి కీర్తించడం నరుల బాధ్యత. నూత్నవేదంలో క్రీస్తుని పంపడం ద్వారా దేవుడు తన ప్రేమనూ నమ్మదగినతనాన్నీ రుజువుచేసికొన్నాడు.

118. రక్షణానికి వందనగీతం

ఇది కృతజ్ఞతాస్తుతి. దేవుడు భక్తుణ్ణి ఫరోరాపద నుండి తప్పించాడు. కనుక అతడు కృతజ్ఞతా భావంతో దేవళానికి వచ్చాడు. దేవాలయ ద్వారం వద్ద ప్రభుని స్తుతించి కీర్తించాడు. ద్వారపాలకుడు అతనికి తలుపు తెరచాడు. భక్తుడు అతని మిత్రులు దేవళంలోకి ప్రవేశించారు. పాటలు పాడుకొంటూ ప్రదక్షిణ చేస్తూ పోయి బలులర్పించే పీరాన్ని చేరారు. ఇది యీ పాటలోని ఇతివృత్తం. కీర్తనకారుడు ఉత్సాహంతో నేను చనిపోను, బ్రతికివుండి