పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/258

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వాసులందరికీ తల్లి.అన్యజాతుల ప్రజలకు గూడ తల్లి. ఎల్ల ప్రజలు తమ భాగ్యాలకు ఆ నగరమే ఆధారమని చెప్పకొంటారు. యూదులకు సియోనులాగా మనకు తిరుసభ తల్లి, ఆ సభకు చెందివున్నందుకు మనం సంతోషించాలి.

88. శోకగీతం

 ఇది గొప్ప శోకగీతం. కీర్తనలన్నిటిలోను విషాద పూరితమైంది. దీన్ని చెప్పిన కవి చాలకాలం శ్రమలు అనుభవించి చివరికి అవసానదశలో వున్నాడు. ఐనా ప్రభువుపట్ల నమ్మకాన్ని కోల్పోకుండ అతన్ని శరణు వేడాడు. అతడు తన పేరు చనిపోయిన వారి జూబితాలోకి ఎక్కిందని బాధపడ్డాడు. చనిపోయినవాళ్లు దేవుణ్ణిస్తుతించలేరు కనుక తన్ను ఈ భూమిమీదనే బ్రతికి వుండనీయమని వేడుకొన్నాడు. నేను బాల్యంనుండి శ్రమలు అనుభవిస్తునే వున్నాను అని చెప్పకొన్నాడు. కనుక అతడు జీవితాంతం కడగండ్లకు గురైనవాడు అనుకోవాలి. కష్టకాలంలో నా స్నేహితులంతా నన్ను విడనాడారు, ఇప్పడు చీకటి మాత్రమే నాకు చెలికాడైంది అనివాకొన్నాడు. ఇది గొప్ప శోకాన్ని తెలియజేసే వాక్యం. ఇంతటి విచారంలో కూడ అతడు ప్రభువుపట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. కనుకనే నేటికీ భక్తకోటికి ఆదర్శంగా వుండిపోయాడు. కష్టాల్లో ఓర్పుని దయచేయమని ప్రభువుని అడుగుకొందాం.

89. విశ్వసనీయుడైన ప్రభువు

  ఇది విలాపగీతం. దీనిలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగం 37వ చరణం వరకు. ఈ మొదటి భాగం దావీదు రాజును గూర్చి ప్రభువు అతన్ని రాజునుగా ఎన్నుకొని అతనితో నిబంధనం చేసికొన్నాడు. అతన్ని తనకు జ్యేష్టపుత్రునిగా చేసికొన్నాడు. అతని సింహాసనం సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుందని మాటయిచ్చాడు. రెండవ భాగం 38వ చరణంనుండి చివరివరకు. ఈ భాగంలో దావీడు వంశానికి చెందిన ఓ రాజు తనకు కలిగిన అవమానాన్ని తలంచుకొని ప్రభువు సమక్షంలో బాధపడుతున్నాడు. ఇతనికి యుద్ధంలో అపజయం కలిగింది, అతని కిరీటం నేలమీద పడిపోయింది. దావీదు వంశపురాజు ఓడిపోయాడు అంటే పూర్వం ప్రభువు దావీదుతో చేసికొన్న నిబంధనం ఏమైనట్లు? ప్రభువు పూర్వం దావీదుకి చూపిన ప్రేమ, అతనికి చేసిన ప్రమాణాలూ మర్చిపోయాడా? ఈలా ఆరాజు తనకు కలిగిన అవమానాన్ని భరించలేక దేవుని ముందట మొరపెట్టాడు. ఈ రాజులాగే మనంకూడ కొన్ని సార్లు ప్రభువు కృపను కోల్పోతాం. అపుడు నమ్మకంతో ప్రభువనే ఆశ్రయించాలి. ప్రభువుకి మనపట్లగలప్రేమ శాశ్వతమైందే. మరి మనకు అతనిపట్ల వుండే ప్రేమ?