పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/254

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74. దేవాలయ విధ్వంసాన్ని గూర్చి శోకగీతం

     ఇది శత్రువులు యెరూషలేము దేవాలయాన్ని నాశంచేసినప్పడు వ్రాసిన శోకగీతం, భక్తులు కొందరు ద్వంసమైన దేవాలయ శిథిలాలను సందర్శించి శోకంతో విలపించారు. దేవాలయం నాశంకావడమంటే ప్రభువు యిప్రాయేలీయులపై కోపించి వారిని చేయి విడవడమే. కాని పూర్వం ఎన్నో రక్షణ కార్యాలను నిర్వహించిన ప్రభువు ఇప్పడు శత్రువుల బారినుండి యిస్రాయేలీయులను కాపాడలేడా? తప్పక కాపాడగలడు. కనుకనే కీర్తనకారుడు నీ పావురాన్ని డేగపాలు చేయకు. పీడితులైన నీ ప్రజలను సదా విస్మరించకు అని మనవిచేసాడు. మనం కూడ పాపం చేసి దైవశిక్షకు గురైనపుడు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడాలి. దేవా! నీవు మమ్మ శాశ్వతంగా విడనాడకు అని ప్రార్థించాలి.

75. దేవుడు న్యాయాధిపతి

 ఈ కీర్తన ప్రభుని న్యాయాధిపతినిగా వర్ణిస్తుంది. యావే దుషులకు తీర్పు చెప్పి వారిని ఖండిస్తాడు. వాళ్ళ తమ శిక్షను పానపాత్రంలోని ద్రాక్షరసాన్నిలాగ త్రాగుతారు. ప్రభువు దుష్టులను శిక్షిస్తాడు. సత్పురుషులకు మాత్రం ఏహాని కలుగదు. అతడు వాళ్లబలాన్ని హెచ్చిస్తాడు. నేడు మన తరుపున మనం పాపం చేసి దేవుని శిక్షను కొనితెచ్చుకోగూడదు. పుణ్యజీవితం గడిపి అతనినుండి బహుమతిని పొందాలి.

76. భయంకరుడైన దేవుడు

 ఈ కీర్తన ప్రభువు విజయాన్ని వర్ణిస్తుంది. అతడు శత్రువులతో పోరాడి విజయాన్ని సాధించాడు. అతడు భీకరుడు. శత్రువులను మట్టుపెట్టి గెలుపును చేపట్టేవాడు. ఆ దేవుణ్ణి కొల్చే భక్తులకు కూడ గెలుపు సిద్ధిస్తుంది. అతన్ని నమ్మినవాళ్లు నాశమైపోరు.

77. యిస్రాయేలు పూర్వచరిత్ర ధ్యానం

    ఇది విలాపగీతం. ఈ కీర్తనను చెప్పిన భక్తుడు ఏదో ఆపదలో చిక్కాడు. నిరుత్సాహ పడ్డాడు. యావే మీద నమ్మకాన్ని కోల్పోయాడు. ప్రభువు తన్ను చేయి విడిచాడు అనుకొన్నాడు. మహోన్నతుని శక్తి సన్నగిల్లిపోయింది అనుకొని బాధ చెందాడు. ఆపిమ్మట అతడు సర్వేశ్వరుడు పూర్వంచేసిన అద్భుత కృత్యాలనూ రక్షణ కార్యాలనూ జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. అతడు యిస్రాయేలీయులను ఈజిప్టునుండి ఎలా నడిపించుకొని వచ్చాడో స్మృతికి తెచ్చుకొన్నాడు. యావేయిస్రాయేలీయులను సముద్రగర్భం గుండా నడిపించుకొని వచ్చాడు. మోషే అహారోనులనే నాయకుల సహాయంతో వారిని ఓ మందనులాగ తోలుకొని