పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/249

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాహాత్యంతో వచ్చి తన్ను కాపాడాలని వేడుకొన్నాడు. ఈ సత్పురుషుని లాగే మనం కూడ ప్రభునినమ్మి అతని సహాయాన్ని అడుగుకొందాం.


58. న్యాయాధిపతులకు న్యాయాధిపతి


అన్యాయపు న్యాయాధిపతులమీద మండిపడి కీర్తనకారుడు ఈ పాట చెప్పాడు. న్యాయాన్ని చెరిచే న్యాయాధిపతులను కసిదీర తిట్టాడు. వారికి పాముకువలె విషమంది అన్నాడు. ఎల్లరికీ న్యాయాధిపతియైన దేవుడు వారి మూతిపండ్లు రాలగొట్టాలని కోరాడు. వాళ్ల కాలిక్రిందపడి నలిగిపోయిన గడ్డిలాగ ఎండిపోవాలని తిట్టాడు, గర్భస్రావం చెందిన పిండంలాగ నాశం కావాలని దూషించాడు. ఇతని కోపమూ తిటూ తీవ్రస్థాయిని చేరుకొన్నాయి. కనుకనే భక్తులు ఈ కీర్తనను తిరుసభ ప్రార్థనలో చేర్చలేదు.

59. దుషుల బారినుండి రక్షించమని ప్రార్ధనం


ఇది విలాప కీర్తనం, భక్తుని శత్రువులు పీడిస్తున్నారు. వారి పోరుపడలేక అతడు ప్రభువుని ఆశ్రయించాడు. యిప్రాయేలు దేవుడవైన ప్రభూ! నీవులే నన్నాదుకో నాయగచాట్ల నీవే చూడు అని మనవి చేసికొన్నాడు. నా రక్షణ దుర్గానివి నీవే, నన్ను కాపాడు అని విన్నపం చేసాడు. కడన ప్రభువు తన్ను ఆపదనుండి తప్పించాడని నమ్మి అతనికి వందనాలు అర్పించాడు. ప్రభువుతో ప్రతి ఉదయం నీ కరుణను కీర్తిస్తాను అని చెప్పకొన్నాడు. ఈ కీర్తనకారునిలాగే మనం కూడ ఆపదల్లో ప్రభుని శరణు వేడాలి. మన ఆపద ఎంత తీవ్రమైందో అంత అధికంగా ప్రభువుకి మనవి చేసికోవాలి.

60. యుద్ధంలో ఓడిపోయి విలపించడం

యిస్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారు. వాళ్ల మూకుమ్మడిగా దేవళానికి వచ్చి ప్రభువుకి ప్రార్థన చేసారు. కీర్తనకారుడు ఈ పాటలో ఆ భక్తులను ఓదార్చాడు. ఈ పాటతో అతడు ప్రజలకు దేవునిపట్ల నమ్మకం పుట్టించి వారిని ప్రోత్సహించాడు. దేవానీవు మామొర విను, నీ బలంతో మమ్ము కాపాడు అని ప్రార్థించాడు. "దేవుడు మన పక్షాన వుంటే మనం శౌర్యంతో పోరాడతాం. అతడు మన శత్రువులనెల్ల నలగడ్రోక్కుతాడు" అని చెప్పాడు. ఈ భక్తుని లాగే మనం కూడ ఇక్కట్టుల్లో ప్రభువుని నమ్మి అతనికి మనవి හීරාභ්‍යවේ.

61. ప్రవాసంలోని భక్తుని ప్రార్ధనం

ఈ పాట చెప్పిన భక్తుడు యెరూషలేముకి దూరంగా ప్రవాసంలో వున్నాడు. అక్కడి బాధలకు తట్టుకోలేక ప్రభువుకి వేడుదల చేసాడు. ప్రభూ! నీవు నా ఆక్రందనాన్ని