పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/248

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54. న్యాయవంతుడైన దేవునికి విన్నపం

ఇది విలాప కీర్తనం. ఈపాట కట్టిన భక్తునికి శత్రుపీడనం ఎదురైంది. కనుకనే గర్వితులు నామీదికి ఎత్తివస్తున్నారు. క్రూరులు నా ప్రాణాలు తీయగోరుతున్నారు అని చెప్పకొన్నాడు. ఐనా తాను ప్రభువుని నమ్మిన భక్తుడు. ప్రభువు తన విరోధులను మన్ను గరిపించి తన్ను కాపాడాలని వేడుకొన్నాడు. కడన దేవుడు శత్రువులను చీకాకుపరచి తన్ను రక్షించినట్లుగానే భావించి వందనాలు అర్పించాడు. మనం కూడ దేవుడు సాయం చేస్తాడని నమ్మి అతన్ని శరణువేడుదాం.

{{

55. హింసల్లో ప్రార్ధనం

}}

ఇది కూడ విలాప కీర్తనమే. ఈ కీర్తనకారునికి తన స్నేహతుడే ద్రోహం చేసాడు. అది అతనికి భరింపరాని బాధఐంది. అతడు రేయింబవళ్లు దుఃఖానికి గురయ్యాడు. ఐనా, నామట్టుకు నేను దేవునికి మొరపెట్టుకొంటాను. అతడు శత్రువుని శిక్షించి నా బాధను తొలగిస్తాడు అనుకొన్నాడు. ఇతనిలాగే మనం కూడా కష్టాల్లో దేవునికి విన్నపం చేయాలి. దేవా! నామొర విను, నా విన్నపాన్ని పెడచెవిని పెట్టుకు అని అడుగుకోవాలి. మనకు మనమే నమ్మకంతో ఓయి! నీ భారాన్ని ప్రభువుమీద మోపు, అతడు నిన్ను భరిస్తాడు అని చెప్పకోవాలి.

56. దేవుని నమ్మడం

ఇది కూడ విలాపకీర్తనం. ఈ కీర్తనకారునికి శత్రుపీడనం ఎదురైంది. అతడు దేవళానికి వెళ్లి తన బాధను ప్రభువుతో చెప్పకొన్నాడు. పూర్వం కూడ అతడు ఆపదల్లో అనేకసార్లు ప్రభువుని ఆశ్రయించి సహాయం పొందివున్నాడు. కనుక ఈ కష్టకాలంలో ప్రభువు తన్ను ఆదరించి కాపాడతాడనే నమ్మకం అతనికుంది. కావననే నీవు నా వేదనను గుర్తించావు. నా అశ్రుబిందువులను నీ సీసాలో పోసివుంచావు, వాటిని గూర్చి నీ గ్రంథంలో లిఖించి వుంచావు అని చెప్పకొన్నాడు. ఈ పుణ్యపురుషునిలాగే మనం కూడ ఇక్కట్టుల్లో ప్రభువుని ఆశ్రయించాలి. దేవుని నమ్మి భయాన్ని విడనాడతాను, మానవ మాత్రులు నన్నేమి చేయగలరు అనుకోవాలి.

57. శత్రువుల నడుమ చిక్కుకోవడం

ఇది కూడ విలాపకీర్తనమే. కీర్తనకారుణ్ణి కష్టాలు చుట్టుముట్టాయి. అవి సింగాల్లాగ, కత్తుల్లాగ, ఉరుల్లాగ, గోతుల్లాగ అతన్ని బాధిస్తున్నాయి. కనుక అతడు ప్రభుని శరణువేడాడు, అతడు తన అద్భుతశక్తితో మింటికి పైగాలేని ధాత్రినంతటిని తన తేజస్సుతో నింపి, తన