పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/237

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనవిచేసికొన్నాడు. నన్ను నీ కంటిపాపనువలె కాపాడమని దేవునికి విన్నవించుకొన్నాడు. మన కంటిపాపను మనం జాగ్రత్తగా కాపాడుకొంటాం, ప్రభువుకూడ మనలను అంత జాగ్రత్తగా కాపాడతాడు. మన జపంలో ఈ నమ్మకం వండాలి.

18. విజయగీతం

ఇది రాజకీర్తనం. దావీదు వంశపు రాజొకడు శత్రువులమీద విజయం సాధించినపుడు పాడినపాట. ఈ రాజు శత్రువులవలని ఆపదలోవుండి దేవునికి మొరపెట్టగా దేవుడు అతనికి సాయం చేసాడు. కవి ఈ సాయాన్ని తుఫానుతో పోల్చాడు. ఈ తుఫానుతో దేవుడు శత్రువులను హతమార్చి రాజును కాపాడాడు అని చెప్పాడు, రాజు ధర్మాన్ని పాటించాడు కనుక ప్రభువు అతన్ని రక్షించాడు. నీతిమంతులెవరో దుర్మార్డులెవరో దేవునికి బాగా తెలుసు. ఎవరిని శిక్షించాలో ఎవరిని రక్షించాలోకూడ ఆయనకు తెలుసు. దేవుడు రాజకి చీకటిలో దీపం వెలిగించాడు. ఆయనతప్ప భక్తులను కాపాడే నాథుడెవడూ లేడు. కనుక రాజు దేవునికి వందనా లర్పించాడు. ఆపదలో మనం ప్రార్ధనంజేస్తే దేవుడు మన వేడికోలు గూడ వింటాడు. ఆ ప్రభువు ఎల్లవేళల మనకు దుర్గం, డాలు, ఆశ్రయస్థాయి.

19. నీతి సూర్యుడైన ప్రభువు

ఈ కీర్తనలో రెండు భాగాలున్నాయి. మొదటిభాగంలో ప్రకృతి దైవసాన్నిధ్యాన్ని తెలియజేస్తుంది అనే అంశాన్ని చెప్పాడు. అద్దంలో మన మొగం కన్పిస్తుంది. ఆలాగే సృష్టిలో దైవరూపం గోచరిస్తుంది. భక్తులు ప్రకృతిలోగూడ భగవంతుణ్ణి దర్శించి ఆరాధించారు. ఇక్కడ కీర్తనకారుడు విశేషంగా సూర్యుణ్ణి అతని ప్రతాపాన్నీ వర్ణించాడు. అతడు ఆకాశమనే పెండ్లిపందిరినుండి ఓ వరునిలాగ వెలువడతాడని చెప్పాడు. మనం కూడ ఈ విశ్వసృష్టి దేవుని మహిమను చాటుతుందని గమనించాలి. కవి రెండవ భాగంలో ధర్మశాస్రాన్ని వర్ణించాడు. అదంటే యూదులకు పరమ ప్రీతి, పరమ గౌరవం. ధర్మశాస్త్రమంటే ప్రభువు ఆజ్ఞలు. అవి మేలిమి బంగారం లాంటివి; స్వచ్ఛమైన తేనెలాంటివి. కీర్తనాంతంలో రచయిత తనతప్పలను మన్నించవలసినదిగా ప్రభువుకి వినతి చేసాడు. మనకు కూడ ప్రభువు కట్టడలపట్ల గౌరవం, పాపభీతి వుండాలి.

20. రాజ విజయంకొరకు ప్రార్ధనం

ఇది రాజకీర్తనం. ప్రభువు యుద్ధంలో రాజుకి సహాయంచేసి అతన్ని కాపాడాలని • ఈ గీతం కోరుకొంటుంది. ఈజిప్టు ప్రజలు అశ్వబలాన్ని రథబలాన్ని నమ్మారు. కాని యిస్రాయేలీయులు దైవబలాన్ని నమ్మారు. కీర్తనకారుడు యిస్రాయేలు నాయకుడైన రాజు