పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/227

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైవ సమాజమూను మిమ్మ కుశలమడుగుతున్నారు" అని వ్రాసాడు– 1కొ 16,19, రోమా 16,3-5.

ఈ దంపతులు ఎఫెసు పట్టణంలో వసిస్తూండగా అపోల్లో అనే బోధకుడు వారి వూరికి వచ్చాడు. ఈ యపోల్లో అప్పడే క్రైస్తవ మతంలో చేరినవాడు. క్రీస్తుని గూర్చి అంతగా తెలియనివాడు. కాని అతడు మహావక్త పూర్వవేదం క్షుణ్ణంగా తెలిసినవాడు. అతడు ఎఫెసు క్రైస్తవ సమాజంలో క్రీస్తుని గూర్చి అనర్గళంగా బోధిస్తూండగా అక్విలా దంపతులు విన్నారు. వెంటనే వాళ్లు అపాల్లోను తన యింటికి ఆహ్వానించారు. అతనికి క్రీస్తుని గూర్చి యింకా లోతుగా బోధించారు. ఆబోధ అపోల్లోకు చాల లాభించింది. అతడు గ్రీసు దేశంలోని ఆయా పట్టణాల్లో బోధచేసి యేసే మెస్సీయా అని నిరూపించాడు. తన్ను ఎదిరించడానికి వచ్చిన యూదుల నోళ్లు మూయించాడు. ఈలా అపాల్లోను ప్రోత్సహించినవాళ్లు అక్విలా ప్రిస్మిల్లా - అచ 18,24-28. వీళ్ల సంసార జీవితం జీవించిన గృహస్థ ప్రజలు, కాని ఆ తొలిరోజుల్లో వాళ్లు శ్రీసభ వ్యాప్తికి తోడ్పడ్డారు. ప్రేషితులుగా పనిచేసారు. మతవ్యాప్తికై కృషిచేసారు.

నేడు ప్రొటెస్టెంటు సమాజాల్లో చాలమంది గృహస్తులు ప్రేషితులుగా, బైబులు బోధకులుగా పని చేస్తూంటారు. కాని మన క్యాతలిక్ సమాజంలో ఈ పద్ధతి అరుదు. మన సమాజంలో మత సేవంతా గురువులూ మఠకన్యలూ చేస్తూంటారు. గృహస్తులు ఈ కార్యానికి ముందుకు రారు. ఒకవేళ వచ్చినా వీళ్ళను ప్రోత్సహించేవాళూ వుండరు. ఇది మన సమాజంలో వున్న ఓ పెద్ద లోపం. మన గృహస్థలు కూడ మతసేవ చేయాలి. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లంతా అతనిలాగే ప్రేషితులౌతారు. "నా తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను" అన్న యోహాను 20,22 వాక్యం గురువులకూ మఠకన్యలకూ మాత్రమే కాదు, సంసార జీవితం జీవించేవాళ్ళకు కూడ వర్తిస్తుంది. కనుక మన ప్రజలు కూడ ప్రేషితులుగా మెలగడం నేర్చుకోవాలి.

ఇంకా మన ప్రజలు ఆయా గృహాల్లో సమావేశమై ప్రార్థనలు జరుపుకోవడం గూడ నేర్చుకోవాలి. ఆయా సందర్భాల్లో ఒక వాడ లేక వీధిలోని వాళ్లంతా ఒక యింటిలో సమావేశమై వేదగ్రంథం చదువుకొని ప్రార్ధనం చేసికొంటే ముచ్చటగా వుంఉటంది. కొన్ని ప్రాంతాల్లో మన జనానికి కుటుంబ జపమాల చెప్పకొనే అలవాటుంది. ఇది మంచి పద్ధతి. కాని ఇది చాలదు. దీనితో పాటు కుటుంబ బైబులు సమావేశాలు కూడ జరుపుకొని ప్రార్థనలు చేసికోవాలి. కుటుంబ భక్తిని పెంపొందించుకోవడానికి ఇది వో వుత్తమ మార్గం.

2. బాలలకు మతవిద్య.

చిన్నపిల్లలకు మతాంశాలూ బైబులూ ఏలా బోధించాలి అన్న అంశంపై నేడు ఎన్నో చర్చలు జరుగుతూన్నాయి. ఏదియేమైనా, పిల్లలకు మొదటి ఉపాధ్యాయులు