పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ ఈ నూత్న వధూవరులను కాపాడిన శక్తి యేమిటి? ఆ దంపతులు ప్రభువుని నమ్మారు. తమ్మ కాపాడమని ప్రభువుకి మనవి చేసారు. ఆ ప్రార్థనాబలమే పిశాచ పీడనుండి వాళ్ళను కాపాడింది. దైవబలమే లేకపోయినట్లయితే సారాను పెండ్లియాడిన ఆ మొదటి ఏడురు వరులవలె తోబియాకూడ నశించేవాడే. కనుక దైవభక్తి ప్రార్థనా ఆ దంపతులనూ వారి దాంపత్య ప్రేమనూ రక్షించింది. వారికి సంతానాన్ని కూడ ప్రసాదించింది.

స్త్రీ పురుషులను దాంపత్య జీవితంలో జతగూర్చే ప్రభువే వాళ్ళకుటుంబాలను కూడ కాపాడుతూంటాడు అని చెప్పాం. సభ్యులంతా కూడి ప్రార్థన చేసే కుటుంబం కలసిమెలసి వుంటుంది, "ఎక్కడ నా పేరు మీదుగా ఇద్దరుముగ్గురు సమావేశమౌతుంటారో వాళ్ళ మధ్య నేనూ నెలకొనివుంటాను" అన్న ప్రభువాక్యం కూడా ఉంది-మత్త 18,20. కనుక గృహస్థలు రోజురోజు కుటుంబ ప్రార్ధనం చేసికోవడానికి అలవాటు పడాలి. సంసారజీవితం గడిపేవాళ్ళకి కుటుంబజపం ఓ బలంమందులా పనిచేస్తుంది.

5. ప్రేషితులుగా గృహస్తులు

1. గృహాలే దేవాలయాలు

మొదటి శతాబ్దంలో క్రైస్తవమతం బాగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. క్రీస్తు ఉత్థానమైనాకే అపోస్తులులూ శిష్యులూ ప్రభువుని గూర్చి బోధిస్తుండేవాళ్ళు భక్తులు పశ్చాత్తాపపడి క్రీస్తుని అంగీకరించి జ్ఞానస్నానం పొందుతూండేవాళ్లు పరిశుద్ధాత్మను స్వీకరిస్తూండేవాళ్లు. ఆ తొలిరోజుల్లో ఇంకా దేవాలయాలు అంటూ లేవు. ఆయా క్రైస్తవ గృహాల్లోనే భక్తులు ప్రోగౌతూండేవాళ్లు. అక్కడే పూజా ప్రార్థనలూ ఉపదేశాలూ జరుగుతూండేవి.

అక్విల అతని భార్య ప్రిస్కిల్ల క్రైస్తవ మతంలో చేరిన యూద దంపతులు. పౌలులాగే వీళ్లు గుడారాల బట్టలు కుట్టుకొని బ్రతికేవాళ్ళు, కనుక వీళ్ళు పౌలుకి మంచి స్నేహితులయ్యారు. చాల కాలం పాటు అతడు ఈ పుణ్యదంపతుల యింట తలదాచుకొన్నాడు. ఓమారు ఏదో ఆపద రాగా ఆ భార్యాభర్తలు తమ ప్రాణాలు కూడ అర్పించి పౌల్లును కాపాడారట. ఆ రోజుల్లో కొరింతులో వున్నవీళ్ళ యిల్ల ఓ గుడిలాగ పనిచేసింది. భక్తులు వీళ్ళ యింటిలో సమావేశమై ప్రార్థనలు జరిపేవాళ్లు. వేద గ్రంథం చదివి వ్యాఖ్య చెప్పేవాళ్లు. పూజ చేయించేవాళ్లు. ఈ దంపతులను గూర్చి పౌలు తన జాబుల్లో చాలాసార్లు ప్రస్తావించాడు. "అక్విలా ప్రిస్మిల్లాయు వారి యింటిలో సమావేశమయ్యే